• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐదేళ్లలో 48...

ఐదేళ్లలో 48 రైల్వేస్టేషన్లే టార్గెట్.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి?

| అంతకంతకూ పెరుగుతున్న రైలు ప్రయాణికులకు తగ్గట్లే రైళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా తాజాగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

By - Garuda Media
Update: 2025-12-27 05:47 GMT

అంతకంతకూ పెరుగుతున్న రైలు ప్రయాణికులకు తగ్గట్లే రైళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా తాజాగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో దేశంలో ఎక్కువ రద్దీగా ఉండే 48 రైల్వే స్టేషన్ల మీద గురి పెట్టింది. ఇక్కడి నుంచి బయలుదేరే రైళ్ల సామర్థ్యాన్ని ఐదేళ్ల వ్యవధిలో రెట్టింపు చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో పెరిగే డిమాండ్ తో పాటు.. ప్రయాణికుల అవసరాల్ని తీర్చటమే లక్ష్యంగా పెట్టుకుంది.

దేశ వ్యాప్తంగా 48 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయగా.. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజువారీగా ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండటంతో.. వీటిని విస్తరించటం.. కొత్త టెర్మినల్స్ ను సిద్ధం చేయటం లాంటి ఏర్పాట్లు చేయనున్నారు. తెలుగురాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్ల విషయానికి వస్తే..

- సికింద్రాబాద్/హైదరాబాద్

- విశాఖపట్నం

- విజయవాడ

- తిరుపతి

ఇక.. టాప్ 10 స్టేషన్లను చూస్తే దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలవగా.. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పే ముంబయి రెండో స్థానంలో నిలిచింది. మూడోస్థానంలో కోల్ కతా.. నాలుగో స్థానంలో చెన్నై నిలిచాయి. హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది. నిజానికి మొదటి ఐదు స్టేషన్లలో హైదరాబాద్ మినహాయిస్తే.. మిగిలిన నాలుగు స్టేషన్లు స్వాతంత్య్రానికి ముందు నుంచి అత్యధిక రైళ్లు నడిచే మార్గాలుగా చెప్పాలి. బెంగళూరు రైల్వే స్టేషన్ ఆరో స్థానంలో నిలిచింది.

ఎంపిక చేసిన ఈ 48 రైల్వే స్టేషన్లలో రానున్న ఐదేళ్ల వ్యవధిలో ఇక్కడి నుంచి రెట్టింపు సామర్థ్యంతో రైళ్లను నడిచేలా చేయటంతో పాటు.. ప్రస్తుత టర్మినల్స్ లో అదనపు ప్లాట్ ఫారాలు నిర్మించనున్నారు. అంతేకాదు.. ఆయా నగరాల చుట్టుపక్కల కొత్త టర్మినల్స్ ను ఏర్పాటు చేయటం.. నిర్వహణ సౌకర్యాలు మెరుగుపర్చటం.. సెక్షనల్ సామర్థ్యాన్ని పెంచటం లాంటివి ఉంటాయి. దేశ వ్యాప్తంగా 48 ప్రధాన రైల్వే స్టేషన్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రైల్వే ప్లానింగ్ డైరెక్టరేట్ కు సమర్పిస్తారు. ఇప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నట్లుగా చెప్పాలి.

Tags:    
  • indianrailways 
  • stationexpansion 
  • doublecapacity 
  • telugustates 
  • hyderabad 
  • visakhapatnam 
  • vijayawada 
  • tirupati 
  • railinfrastructure 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS