• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం...

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

| నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో రూ.7 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో తమకు సంబంధం లేదని జనసేన నేతలు కల్యాణం శివశ్రీనివాసరావు, కోట రుక్మిణి స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా రాజకీయంగా తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-19 08:02 GMT

ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యవహారంపై జనసేన నేతలు ఎట్టకేలకు స్పందించారు. ఈ విషయంలో నిందితులను వదిలిపెట్టి ఉద్దేశపూర్వకంగా తమను టార్గెట్ చేస్తున్నారని జనసేన నేతలు కల్యాణం శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి స్పష్టం చేశారు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏడు కోట్లు వసూలు చేసిన నేరంపై రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్నామని చెప్పడమే కాకుండా, ఆ పార్టీకి చెందిన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు, కేంద్ర కార్యాలయ కార్యకలాపాలను పర్యవేక్షించే మహిళా నేత కోట రుక్మిణి పేర్లు వాడుకుని ఇద్దరు నిందితులు రూ.7 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తమ దృష్టికి వచ్చిన వెంటనే జనసేన నేతలు శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేస్తుండటంపై మీడియాకు వివరణ ఇచ్చారు.

ఈ నెల 11న జనసేన నేతలు కల్యాణం శ్రీనివాసరావు, కోట రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ స్కాం బయట పడింది. బాధితులు ఎవరూ పోలీసులను ఆశ్రయించకపోయినా, తమ పేర్లు జనసేన కేంద్ర కార్యాలయం చిరునామాను ఉపయోగించుకుని నిందితులు మోసం చేస్తున్నట్లు శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణికి సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అప్పటికే పరార్ అవగా, సహ నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా విపక్ష నేతలు తమను టార్గెట్ చేస్తున్నారని జనసేన నేతలు కల్యాణం శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై విపక్ష నేతల ఆరోపణలను తిప్పికొడుతూ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నిందితులు ఉపయోగించిన నకిలీ పత్రాలను మీడియా ఎదుట ప్రదర్శించారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ సంగతి తెలిసి నిందితురాలు తనకు వాట్సాప్ లో మెసేజ్ చేసిందని, తాను ఏ తప్పు చేయలేదని లేఖ రాసిందని తెలిపారు. ఈ విషయాన్ని సాక్ష్యంగా చూపేందుకు తాను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లానని వివరించారు. పవన్ నుంచి తనను వేరు చేసేందుకు పార్టీలో కొందరు నాయకులు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఇదే విషయంపై స్పందించిన కోట రుక్మిణి తన వాదనను వినిపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

తన వద్ద పనిచేస్తున్న నిందితురాలు ఉద్యోగాల పేరుతో మోసం చేసిందని తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా నిందితురాలిని తన సంస్థ నుంచి తప్పించినట్లు వివరించారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ ను అనవసరంగా లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మౌనాన్ని బలహీనతగా, సహనాన్ని భయంగా చూడొద్దని హెచ్చరించారు. పార్టీకి అంకితభావంతో సేవలు చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టపరంగా పోరాడుతానని, పార్టీకి నాయకత్వానికి చెడ్డపేరు తేవాలనే కుట్రలను అడ్డుకుంటానని తేల్చిచెప్పారు.

కాగా, గత వారం రోజులుగా జనసేన కేంద్ర కార్యాలయం వేదికగా ఉద్యోగాల కుంభకోణం జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జనసేన కీలక నేతల వద్ద నిందితులు పనిచేశారని చెబుతున్నారు. దీనిని సాకుగా తీసుకుని కుంభకోణంలో జనసేన నేతలకు ప్రమేయం ఉందనే విధంగా ప్రచారం చేయడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం జోక్యం చేసుకుందని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే జనసేన నేతలే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని పార్టీ అధిష్టానం గమనించిందని అంటున్నారు. దీంతో పార్టీ నేతలతో వివరణ ఇప్పిండమే కాకుండా చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు.

Tags:    
  • janasena 
  • pavankalyan 
  • jobscam 
  • kalyanamsivasrinivasarao 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS