వివాహం అయిన 24 గంటల్లోనే విడాకులు.. ఊహించని కారణం!

ఇటీవల కాలంలో విడాకులు అనే టాపిక్ అత్యంత సహజమైపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-27 07:30 GMT

ఇటీవల కాలంలో విడాకులు అనే టాపిక్ అత్యంత సహజమైపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, పరిస్థితులు ఏవైనా, తదుపరి పరిణామాలు ఎలాంటివైనా.. తాము తీసుకున్న నిర్ణయం మేరకు మరో ఆలోచన లేకుండా, ప్రత్యామ్నాయం వైపు చూడకుండా చాలా మంది దంపతులు విడాకులే అంతిమ పరిష్కారం అనే నిర్ణయానికి వస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అవును... మహారాష్ట్రలోని పూణెలో విడాకులకు సంబంధించిన ఓ షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... వివాహం జరిగిన కేవలం 24 గంటల్లోనే ఒక జంట విడిపోయారు. పెళ్లైన తర్వాత ఒక్కరోజైనా గడవకముందే తమ వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు గల కారణం అత్యంత షాకింగ్ గా ఉండగా... పైగా వీరిది ప్రేమ వివాహం అని.. పెళ్లి ముందు కనీసం రెండు మూడు సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకున్నారని అంటున్నారు.

దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయవాది రాణి సోనావానే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు! ఇందులో భాగంగా... ఈ కేసులో ఎలాంటి హింస లేదా నేరపూరిత తప్పు చేసినట్లూ ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. వివాహం అయిన తర్వాత ఈ జంట.. శాంతియుతంగా చట్టపరమైన ప్రక్రియను అనుసరించి, పరస్పర అంగీకారంతోనే వీరి వివాహాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా... వివాహం జరిగిన మరుసటి రోజే ఆ జంట విడివిడిగా జీవించడం ప్రారంభించారని చెప్పిన న్యాయవాది రాణి సోనావానే.. వీరిది ప్రేమ వివాహమని.. వివాహానికి ముందు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ఒకరినొకరు తెలుసుకున్నారని తెలిపారు. అయిఏ.. భర్త తన భార్యతో.. తాను ఓడలో పనిచేస్తున్నానని.. తనను ఎప్పుడు, ఎక్కడ నియమిస్తారో, ఎంతకాలం దూరంగా ఉంటానో చెప్పలేనని చెప్పాడని అన్నారు.

దీంతో.. ఆమె అభిప్రాయం, ఆలోచన అనంతరం ఇద్దరూ పరస్పరం విడిపోవడమే ఉత్తమమని భావించారని.. అనంతరం తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు! ఈ నేపథ్యంలో.. ఇటువంటి కేసులకు వర్తించే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత.. కోర్టు తన నిర్ణయాన్ని జారీ చేసిందని తెలిపారు. అయితే.. రెండు మూడేళ్ల ప్రేమ బంధంలో ఇద్దరి మధ్యా ఇంత కీలకమైన అంశం ఎందుకు చర్చకు రాలేదనేది ఆశ్చర్యంగా ఉందని ఆమె తెలిపారు.

అయితే... అతడు ఇంజినీర్ అనే విషయంపై మాత్రమే ఆమెకు స్పష్టత ఉంది తప్ప.. ఏడాదిలో చాలా కాలం సముద్రంలోనే ఉంటారనే విషయంపై ఆమెకు క్లారిటీ లేకపోయి ఉండొచ్చని అంటున్నారు. కాగా.. ఆ వ్యక్తి మెరైన్ ఇంజినీర్ కాగా.. ఆమె వైద్యురాలు!

Tags:    

Similar News