అమెరికా విషయంలో పాక్ రక్షణ మంత్రి రోధన అంతకుమించి..!

అవును... గతంలో అమెరికాతో ఇస్లామాబాద్ పొత్తు పెట్టుకున్న తీరుపై అత్యంత స్పష్టమైన, అర్ధవంతమైన విమర్శ ఒకటి చేశారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.;

Update: 2026-02-11 09:30 GMT

గత ఏడాది రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్ తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతకంటే ఎక్కువగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ రాసుకు పూసుకు తిరిగేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడంతో పాటు ప్రపంచ వేదికలపై శాంతి దూత అని కొనియాడిన పరిస్థితి! అయితే... అమెరికా మాత్రం పాకిస్థాన్ ను అవసరానికి వాడుకుని వదిలేస్తుందంటూ ఆ దేశ రక్షణ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అవును... గతంలో అమెరికాతో ఇస్లామాబాద్ పొత్తు పెట్టుకున్న తీరుపై అత్యంత స్పష్టమైన, అర్ధవంతమైన విమర్శ ఒకటి చేశారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఈ సందర్భంగా... పాకిస్థాన్ ను వాషింగ్టన్ నిత్యం తన వ్యూహాత్మక లాభం కోసం ఉపయోగించుకుని.. దాని లక్ష్యాలు నెరవేరిన అనంతరం వదిలేస్తుందని ఆరోపించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆసిఫ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి!

ప్రధానంగా 1999 తర్వాత.. ముఖ్యంగా 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత వాషింగ్టన్ తో పాక్ తిరిగి పొత్తు పెట్టుకోవడాన్ని ఒక చారిత్రాత్మక తప్పుగా ఆసిఫ్ అభివర్ణించారు. నాటి తప్పుడు అడుగు పరిణామాలు పాకిస్థాన్ ఇప్పటికీ భరిస్తుందని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే... పాకిస్థాన్ ను టాయిలెట్ టిష్యూ పేపర్ కంటే దారుణంగా చూశారని.. దాన్ని అవసరానికి ఉపయోగించారని.. అనంతరం పారేశారని అన్నారు. దీంతో.. రక్షణ సాఖ మంత్రి రోధన చర్చనీయాంశంగా మారింది.

ఇదే క్రమంలో... 1980ల్లో ఆఫ్గాన్ లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం నిజమైన మతపరమైన ఆవశ్యకత కంటే కూడా అమెరికా ప్రయోజనాలచే నిర్మించబడిందని వాదించిన ఆసిఫ్... నాటి పరిస్థితులు జీహాద్ ప్రకటించడానికి హామీ ఇవ్వకపోయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తీవ్రంగా జోక్యం చేసుకుని, అస్థిరతను సృష్టించిందని.. దాని ప్రభావాలు ఇన్ని దశాబ్ధాల తర్వాత కూడా అనుభూతి చెందుతున్నాయని అన్నారు.

అదేవిధంగా... అమెరికా నేతృత్వంలోని ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్థాన్ మరోసారి వాషింగ్టన్ తో జతకట్టిందని.. 2001 తర్వాత కాలంలో ఇది జరిగిందని.. అయితే ఈ ప్రక్రియలో తాలిబన్లకు వ్యతిరేకంగా పాక్ మారిందని ఆసిఫ్ అన్నారు. ఫైనల్ గా ఆ ప్రాంతం నుంచి అమెరికా జాగ్రత్తగా వైదొలగినప్పటీకీ.. నాటి ప్రభావంతో పాకిస్థాన్ మాత్రం దీర్ఘకాలిక హింస, తీవ్రవాదంతో పాటు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు!

ఇక 1999లో అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని సైన్యం.. ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేసి, అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పారు ఆసిఫ్ ఖవాజా. ఈ విధంగా తాజాగా పాకిస్థాన్ అసెంబ్లీలోనే రక్షణ మంత్రి హోదాలో ఆయన చేసిన పలు కీలక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో.. అమెరికాతో స్నేహం విషయంలో మునీర్ తప్ప మరెవరూ హ్యాపీగా లేనట్లున్నారనే చర్చా జరుగుతుంది.

Tags:    

Similar News