షాకింగ్ రీజన్... ట్రంప్ అంతేనమ్మ దేనికైనా సుంకం విధించేస్తారు!

ఆ సమయంలో తాను స్పందిస్తూ... స్విట్జర్లాండ్ చిన్నదేశం అయినప్పటికీ, అమెరికాతో పెద్ద వాణిజ్య లోటు (సుమారు 42 బిలియన్ డాలర్లు) ఎదుర్కోంటోందని చెప్పానని అన్నారు.;

Update: 2026-02-11 09:31 GMT

దౌపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలకు అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ మార్చేస్తున్నారనే చర్చ ఇటీవల చాలా తీవ్రంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పైకి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెబుతున్నా... ప్రతీదీ తన ఈగో మేరకే ఆలోచిస్తుంటారని చెబుతూ... ఆయన రాజకీయ నాయకుడికంటే ముందు బిజినెస్ మ్యాన్ అని గుర్తుచేస్తుంటారు. ఈ క్రమంలో ఓ నాయకురాలు మాట్లాడిన విధానం నచ్చకపోవడంతో ఆ దేశంపై సుంకం పెంచేశారు ట్రంప్!

అవును... కారణం లేకుండా కార్యం పుట్టదు అని అంటారు. కానీ.. ట్రంప్ మాత్రం కార్యాన్ని పుట్టించడానికి కారణాన్ని సృష్టిస్తుంటారు.. రొటీన్ కి భిన్నంగా! ఈ క్రమంలో... స్విస్ నాయకురాలు తనతో మాట్లాడిన విధాన నచ్చకపోవడంతో.. స్విస్ పై అదనంగా తొమ్మిది శాతం సుంకాలను పెంచాలని ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాజాగా ఫాక్స్ బిజినెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు!

ఇందులో భాగంగా... తాను స్విట్జర్లాండ్ పై 30 శాతం సుంకం విధించాను కానీ అది చాలా తక్కువ అని చెప్పిన ట్రంప్... ఆ సమయంలో స్విట్జర్లాండ్ ప్రధానమంత్రి నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని.. ఆ సమయంలో తనతో మాట్లాడిన ఆమె (స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్) చాలా దూకుడుగా ఉంది.. కానీ బాగుంది అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె... తమది చిన్న దేశమని.. తాము అంత చెల్లించలేమని చెప్పిందని తెలిపారు.

ఆ సమయంలో తాను స్పందిస్తూ... స్విట్జర్లాండ్ చిన్నదేశం అయినప్పటికీ, అమెరికాతో పెద్ద వాణిజ్య లోటు (సుమారు 42 బిలియన్ డాలర్లు) ఎదుర్కోంటోందని చెప్పానని అన్నారు. ఆ సమయంలో ఆమె నాతో మాట్లాడిన విధానం నిజంగా నచ్చలేదని చెప్పిన ట్రంప్... అందుకే సుంకాలు తగ్గించడానికి బదులుగా... 30 శాతాన్ని మరో తొమ్మిది పెంచి 39 శాతానికి పెంచినట్లు తెలిపారు. దీంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

కాగా.. 2028 చివరి నాటికి అమెరికాలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి స్విస్ ఇండస్ట్రీ కట్టుబడి ఉండటంతో సుంకాల రేటును 15 శాతానీ తగ్గించడానికి ట్రంప్ అంగీకరించిన సంగతి తెలిసిందే! ఈ మేరకు జనవరి 21న దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో మాట్లాడిన ఆయన.. తాను ప్రజలను బాధపెట్టాలని అనుకోవడం లేదని.. అందుకే సుమాకాలను తగ్గించానని.. అంటే అధి భవిష్యత్తులో పెరగదని కాదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!

ఏది ఏమైనా... స్విట్జర్లాండ్ పై సుంకాలను 30 శాతం నుంచి 39 శాతానికి పెంచడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన కారణం మాత్రం ఆసక్తిగా మారింది. దీంతో... ట్రంప్ అంతేనమ్మ దేనికైనా సుంకం విధించేస్తారు.. పెంచేస్తారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!


Tags:    

Similar News