అది కూడా తెలియదా? ఎంపీ మిథున్ రెడ్డిపై ట్రోల్స్

Update: 2020-02-07 11:08 GMT
విశాఖపట్నం మిలీనియం టవర్స్ లో కంపెనీలన్నీ ఖాళీ చేయిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో గళమెత్తారు. దీనికి సమాధానంగా వైసీపీ లోక్ సభ పక్ష నేత, ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

విశాఖలోని మిలీనియం టవర్స్ లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే డమ్మీ ఫేక్ కంపెనీని ఏర్పాటు చేశారని.. 30 కోట్లు పెట్టుబడులు పెట్టిన ఈ కంపెనీకి వేయి కోట్ల విలువైన భూములను చంద్రబాబు సర్కారు కట్టబెట్టిందని.. దాన్ని సరిచేస్తున్నామని ఎంపీ మిథున్ రెడ్డి సమాధానమిచ్చారు.

అయితే మిథున్ రెడ్డి సమాధానంతో సభలో నవ్వులు పూశాయి. ఎందుకంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంతర్జాతీయ కంపెనీ. రెండు దశాబ్ధాలుగా ఇండియాలో పెట్టుబడులు పెట్టి ప్రఖ్యాత సంస్థగా ఎదిగింది. ఆ సంస్థను ఫేక్ సంస్థగా మిథున్ రెడ్డి అనడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఎంపీ మిథున్ రెడ్డి వీడియోను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఆ కంపెనీ కూడా వివరణ ఇచ్చింది. తాము అంతర్జాతీయ కంపెనీ, పెట్టుబడి దారులమని.. తమ గురించి తెలియాలంటే వెబ్ సైట్ చూడాలని లింక్ షేర్ చేసింది. ఈ ఘటనను బేస్ చేసుకొని మిథున్ రెడ్డి సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News