ఏపీ పార్టీలు.. అధినేతలు సిగ్గుపడేలా చేసిన ఆ ఇద్దరు
పోరాడి సాధించుకున్న హక్కును వేరే వాళ్లకు ఇచ్చేస్తామంటే? ఇంటికి ఆభరణమైన విలువైన వస్తువును పెద్ద కారణాలు ఏమీ లేకుండానే అమ్మేస్తామని చెబితే? అది కూడా ఇంటి వారికి ఏ మాత్రం ఇష్టం లేకుండా? ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో అమ్మేయటమేనని.. ప్రైవేటుకు కట్టబెట్టేయటమేనని పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నోటి నుంచి మాట వచ్చిన రోజు వ్యవధిలో ఇద్దరు ప్రముఖులు ఈ అంశంపై స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.
విశాఖ ఉక్కును కాపాడుకుందామని.. దాన్ని సేవ్ చేసుకునేందుకు తాము కూడా మద్దతు ఇస్తామన్న సంచలన వ్యాఖ్యను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అంటే.. నాటి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న చిరంజీవి.. మెగాస్టార్ గా మారిన ఈ వేళ.. తన సంపూర్ణ మద్దతు ప్రకటించటం విశేషంగా చెప్పాలి. ఈ ఇద్దరి ప్రముఖుల మాటల్లోని సారాంశం చాలా సింఫుల్. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును కాపాడుకోవటం.. ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవటమే.
అనుకోని రీతిలో ఈ ఇద్దరు ప్రముఖుల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఏపీలోని రాజకీయ పార్టీ అధినేతల్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. విన్నంతనే కాస్త పరుషంగా అనిపించొచ్చు కానీ.. ఇష్యూ లోతుల్లోకి వెళ్లి చూస్తే.. ఈ మాట తప్పేం కాదని చెప్పాలి. ఓపక్క లోక్ సభలో కేంద్రమంత్రి ఓపెన్ గా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేసే ఆలోచన లేదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టేసిన తర్వాత తీవ్రస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఏపీ పార్టీ అధినేతల మీద ఉంది.
తమ పదవుల్ని విశాఖ ఉక్కుకోసం రాజీనామా చేయటం.. ఏపీ ప్రజల్ని ఈ విషయం మీద తీర్పు ఇవ్వాలని అధికార.. విపక్షపార్టీల ప్రజాప్రతినిధులు కోరితే తప్పేంటి? పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఒకే మాట మీద నిలబడి.. ఏపీకి చెందిన ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేస్తే ఎలా ఉండేది? కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ ప్రజలు సైతం.. స్థానిక బీజేపీ నేతలపై ఒత్తిడి తేవటంతో పాటు.. వారంతా కూడా అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు షురూ చేస్తే ఎంత బాగుండేది? బీజేపీ నేతలు ఎవరు ఎలాంటి ప్రోగ్రాం పాల్గొన్నాసరే.. తాము కవర్ చేయమని మీడియా సంస్థలు సైతం నిర్ణయం తీసుకోవటం.. ప్రజలు సైతం.. వారి కార్యక్రమాలు ఏమైనా సరే.. ఆంద్రోడు ఒక్కడంటే ఒక్కడు కూడా వెళ్లడన్న నిర్ణయం తీసుకొని ఉంటే ఎలా ఉండేది? ఇలా చెప్పుకుంటూ పోతే.. కేంద్రం మీద ఒత్తిడి తేవాలనుకుంటే పిచ్చబోలెడుమార్గాలు ఉన్నాయి. కాకుంటే.. అన్నింటికి మించి ముందు కావాల్సింది కమిట్ మెంట్. విశాఖ ఉక్కును కాపాడుకోవాలన్న ఆలోచన ఏపీలోనిరాజకీయ పార్టీలు.. ప్రజలకు ఉంటే.. వెంటనే ఇలాంటి నిర్ణయాల్ని తీసుకొని అమలు చేయాల్సి ఉంటుంది. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ కు చురుకు పుట్టింది కానీ సొంత ప్రజాప్రతినిధులకు చురుకు తగలకపోవటం ఏమిటి? అంతలా వారు మొద్దుబారిపోయారా? అన్నది అసలు సందేహం?