'బ్యాడ్ శాంటా'... క్రిస్మస్ వేళ ట్రంప్ కామెడీ యాంగిల్ ఇదే!
రెండోసారి అమెరికా అధ్యస్ఖుడిగా బాధ్య్తలు స్వీకరించినప్పటి నుంచీ తనదైన శైలిలో అగ్రసివ్ గా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్;
రెండోసారి అమెరికా అధ్యస్ఖుడిగా బాధ్య్తలు స్వీకరించినప్పటి నుంచీ తనదైన శైలిలో అగ్రసివ్ గా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్.. క్రిస్మస్ పండుగ వేళ పిల్లలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా తన హయాంలో అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఈ క్రిస్మస్ వేళ శాంటాక్లాజ్ కు జత చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... ట్రంప్ క్రిస్మస్ పండుగ ఉత్సాహాన్ని వ్యాప్తి చేస్తూ.. పిల్లలతో సరదాగా గడిపారు. అదే సమయంలో.. దేశంలోకి "మంచి శాంటా" మాత్రమే అనుమతించబడుతుందని వారికి హామీ ఇచ్చారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్ లో ఈ సంభాషణలు జరిగాయి. అక్కడ ప్రథమ మహిళ మెలానియాతో కలిసి నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ శాంటా ట్రాకర్ కాల్స్ లో పాల్గొన్నారు.
ఈ సమయంలో.. డొనాల్డ్ ట్రంప్ 4 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో మాట్లాడుతూ.. వారు ఏ బహుమతులను పొందడానికి ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నారో అడిగారు. ఈ నేపథ్యంలో.. తన దైన సిగ్నేచర్ శైలిలో.. అతను సెలవుల వినోదాన్ని భద్రతతో ముడిపెట్టి, "అతను (బ్యాండ్ శాంటా) చొరబడకుండా చూసుకోవాలనుకుంటున్నాము.. మనం, మన దేశంలోకి చెడ్డ శాంటాలు చొరబడటం లేదు" అని అన్నారు.
ఈ సందర్భంగా... మేము ప్రపంచవ్యాప్తంగా శాంటాను ట్రాక్ చేస్తామని.. శాంటా మంచిగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నామని.. శాంటా చాలా మంచి వ్యక్తి అని.. ఈ క్రమంలో చెడు శాంటాను చొరబడకుండా చూసుకోవాలనుకుంటున్నామని అన్నారు.
ఇలా తన హాలిడే విషెస్ లతో రాజకీయ వ్యాఖ్యానాలను కలిపే చరిత్ర కలిగిన ట్రంప్.. ఉల్లాసమైన స్వరాన్ని కొనసాగించారు కానీ.. తన సాధారణ విమర్శలను ఆపకుండా ఉండలేకపోయారు. ఇందులో భాగంగా... ఈ కార్యక్రమం తర్వాత కొన్ని గంటలకు.. అతను ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేస్తూ... “మన దేశాన్ని నాశనం చేయడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తూ.. తీవ్రంగా విఫలమవుతున్న రాడికల్ లెఫ్ట్ స్కమ్ తో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు" అని రాసుకొచ్చారు ట్రంప్.
ఈ క్రమంలో... ట్రంప్ - మెలానియా దంపతులు డజను కాల్స్ తీసుకున్నారు. ఈ సమయంలో.. మెలానియా వేరే కాల్ లో ఉన్నప్పుడు ఆమె శ్రద్ధలో స్వల్ప లోపాన్ని ట్రంప్ హాస్యాస్పదంగా ఎత్తి చూపారు. ఇలా శాంటా అలవాట్ల గురించి జోకులు వేయడం, ఉల్లాసభరితమైన రాజకీయ జోకులు వేయడం వరకూ సెలవుల కాలంలో అధ్యక్షుడి తేలికైన, మరింత వ్యక్తిగత వైపును ప్రదర్శించారు.