స్పెర్మ్ డొనేషన్ తో సెంచరీ చేసిన సీఈఓ... తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్య!
సుమారు 15, 16 ఏళ్ల కిందట తన స్నేహితుడొకరు తనను కలిసి వింత సాయం కోరాడని;
సుమారు 15, 16 ఏళ్ల కిందట తన స్నేహితుడొకరు తనను కలిసి వింత సాయం కోరాడని.. ఇందులో భాగంగా.. తన మిత్రుడికి, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం తనను వీర్యదానం చేయమని అడిగారని.. అది విని తొలుత తనకు నవ్వొచ్చినా.. ఆ తర్వాత ఈ సమస్య ఎంత తీవ్రమైందో అర్ధమైందని.. అప్పటి నుంచి స్పెర్మ్ డొనేషన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని పావెల్ దురోవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ సమస్య తీవ్రత అర్ధమై స్పెర్మ్ డొనేషన్ లో రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. అలా ఇప్పటివరకూ 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉందని.. అలాంటి వారికి పిల్లలను ఇచ్చి ఆ జంటల ఇంట సంతోషం తెచ్చేందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు పావెల్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంలో మరో ఆఫర్ ఇచ్చారు.
అవును... స్పెర్మ్ డొనేషన్ గురించి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలిచే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్య వాడుకొని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐ.వీ.ఎఫ్) చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని ఆఫర్ ఇచ్చారు. స్పెర్మ్ డొనేషన్ ను పౌర విధిగా భావిస్తున్నట్లు చెబుతూ.. హెల్తీ పురుషులు ఈ పనికి పూనుకోవాలని పిలులునిచ్చారు.
వాస్తవానికి స్పెర్మ్ డొనేషన్ లో రిజిస్టర్ అయిన దురోవ్ వీర్యం రష్యా రాజధాని మాస్కోకు చెందిన క్లీనిక్ లో అందుబాటులో ఉంది. వాస్తవానికి చాలా ఏళ్ల క్రితమే ఆయన తన వీర్యాన్ని దానం చేయడం ఆపేశారు. అయితే.. గతంలో ఆయన దానం చేసిన విర్యాన్నే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 15 ఏళ్ల పాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో 100 మంది పిల్లలు జన్మించారని ఇప్పటికే ప్రకటించారు.
ఈ 100 మందితో పాటు తన ముగ్గురు భాగస్వాములతోనూ దురోవ్ కు ఆరుగురు సంతానం ఉన్నారు. ఈ నేపథ్యంలో.. తన జీవసంబంధమైన ఈ 106 మంది పిల్లలందరికీ తన సంపదలో సమాన వాటా లభిస్తుందని దురోవ్ తెలిపారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా నివేదిక ప్రకారం.. అతని స్పెర్మ్ కు డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో గత ఏడాది మాస్కోలోని ఓ క్లినిక్ లో దురోవ్ స్పెర్మ్ ను ఉచితంగా అందించే ప్రకటనకు డజన్ల కొద్దీ మహిళలు స్పందించారు.