సివిల్స్ లో తెలుగోడి సత్తా

వీరే కాకుండా కనీసం 30 మంది తెలుగు అభ్యర్థులు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ 2025 పోస్టులను గెలుచుకున్నారు.;

Update: 2026-03-06 17:10 GMT

దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలలో తెలుగు వాడి సత్తా మరో మారు తెలిసింది. కీలకమైన ర్యాంకులను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సాధించి తెలుగు వారి ప్రతిభను చాటి చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ -2025 పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ పరీక్షలలో మొత్తం 958 మంది అభ్యర్థులు ఏఐఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర పోస్టులకు అర్హత సాధించారు అయితే ఫస్ట్ ర్యాంక్ ని అనూజ్ అగ్ని హోత్రీ సాధించగా రెండవ స్థానంలో రాజేశ్వరి నువే, మూడవ స్థానంలో అకాంక్ష్ రాఘవ ఝన్ ఝన్ వాలా నాలుగవ స్థానంలో ఇషాన్ భట్నాకర్ అయిదవ స్థానంలో నిలిచారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మంచి ర్యాంకులు సాధించ వారు ఇందులో మెరిసారు.

తెలుగు ఖ్యాతి పెంచేలా :

ఇక యూపీఎస్సీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించి తెలుగు ఖ్యాతిని పెంచిన వారి లిస్ట్ చూస్తే 55వ ర్యాంక్ తో సృజన ఉంటే 193 ర్యాంక్ తో డీఎస్ కే ప్రచేత్, 259 ర్యాంక్ తో ఎస్ వర్షిత్ రెడ్డి, 297 ర్యాంక్ తో ఎం పవన్ కుమార్ రెడ్డి, 541 ర్యాంక్ తో వి విక్రం సింహారెడ్డి ఉన్నారు. అలాగే 573 ర్యాంక్ తో శ్వేత గుమ్మల, 682 ర్యాంక్ తో వి విజయ్ సింహారెడ్డి, 738 ర్యాంక్ తో పోతుపురెడ్డి భార్గవ్, 748 ర్యాంక్ తో పుడారి రాహుల్ ఉన్నారు. ఇక 786 ర్యాంక్ తో అనిరుధ్ కత్తిమాని ఉన్నారు. 806 ర్యాంక్ తో కోరపాతుల శ్రీకర్ రాజు, 823 ర్యాంక్ తో ఇస్లావత్ శ్రీరాం హర్ష, 908 ర్యాంక్ తో కట్టా ప్రత్యూష, 920 ర్యాంక్ తో గోగుల రాజశేఖర్, 939 ర్యాంక్ తో గంగలోతు జితేందర్ నాయక్ ఉన్నారు.

ముప్పై మంది దాకా :

వీరే కాకుండా కనీసం 30 మంది తెలుగు అభ్యర్థులు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ 2025 పోస్టులను గెలుచుకున్నారు. ఇక ఇందులో తెలంగాణ రాష్ట్రం చెందిన పెద్దపల్లికి చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంక్‌ను సాధించడం గొప్ప విశేషంగానే చూడాలని అంటున్నారు. సివిల్ సర్వీసెస్ మెయిన్ ఫలితాలను గత సంవత్సరం నవంబర్‌లో ప్రకటించారు. ఈ పరీక్షలని గత ఏడాది ఆగస్టులో నిర్వహించారు.

మూడు దశలలో :

ఇక సివిల్ సర్వీసెస్ పరీక్షను ప్రతి సంవత్సరం మూడు దశలలో నిర్వహిస్తారు ఇందులో ప్రిలిమినరీ, మెయిన్ ఇంటర్వ్యూ దశలుగా యూపీఎస్సీ నిర్వహిస్తుంది. వీటి నుంచే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏఏఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఏఎఫ్ ఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేస్తారు.

Tags:    

Similar News