జడ్పీ చైర్మన్ గా పరిటాల వారసుడు ?
దీంతో జడ్పీటీసీ ఎంపీటీసీల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శుక్రవారం లాస్ట్ మినిట్ లో పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేసి అందరికీ షాక్ తినిపించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఆయన ప్రజా జీవితం ఒక శకంగా చెబుతారు. ఆయన రాజకీయాల్లో ఉన్నది పట్టుమని పదేళ్ళ కాలం అయినా జనం గుండెలలో నిలిచిపోయారు. అన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు ప్రజా జీవితంలోకి వచ్చిన పరిటాల 1994లో ఎన్టీఆర్ కేబినెట్ లో కార్మిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎన్టీఆర్ జీవించి ఉన్నంతవరకూ ఆయన వర్గంగానే మెలిగారు. తదనంతరం చంద్రబాబు వైపు వచ్చారు. ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తరువాత 2004లో టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డారు. అయితే 2005 జనవరి 25న పరిటాల హత్య కావించబడ్డారు. ఇక ఆయన సతీమణి సునీత 2014 లో తొలిసారి గెలిచి బాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2024 లో మరోసారి ఆమె గెలిచారు.
యంగ్ అండ్ డైనమిక్ :
ఇక వారి వారసుడు పరిటాల శ్రీరామ్ అయితే ఇప్పటిదాకా చట్ట సభలలోకి అడుగుపెట్టలేదు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న పరిటాల శ్రీరామ్ ని నారా లోకేష్ యూత్ టీమ్ లోకి తీసుకున్నారు. ఆయనను తమ్ముడిగా సంభోదిస్తూ తగిన అవకాశాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. నిజానికి 2024 లో ధర్మవరం అసెంబ్లీ టికెట్ శ్రీరామ్ కి రావాల్సిందే కానీ పొత్తు ధర్మంలో బీజేపీకి ఆ సీటు లభించింది. అక్కడ నుంచి సత్య కుమార్ యాదవ్ విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. దీంతో రెండున్నరేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తూ ధర్మవరం ఇంచార్జ్ గా ఉన్న శ్రీరామ్ కి అనూహ్యంగా టీడీపీ హైకమాండ్ మంచి ఆఫర్ ఇచ్చింది.
లాస్ట్ మినిట్ లో అలా :
దీంతో జడ్పీటీసీ ఎంపీటీసీల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శుక్రవారం లాస్ట్ మినిట్ లో పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేసి అందరికీ షాక్ తినిపించారు. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా చాలా సింపుల్ గా ఆయన తన నామినేషన్ ఇచ్చి వచ్చారు. అంటే శ్రీరామ్ కి కూడా చివరి దాకా ఈ విషయం తెలియదు అనుకోవాలి. ఆయన కదిరి నియోజకవర్గం నల్లచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఆయన ఫేస్ చేయబోతున్నారు అని అంటున్నారు.
జిల్లా పరిషత్తుకే :
దీంతో అన్నీ ఆలోచించిన మీదటనే పరిటాల శ్రీరామ్ చేత నామినేషన్లను టీడీపీ అధినాయకత్వం దాఖలు చేయించారు అని అంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్ గా పరిటాల శ్రీరామ్ అతి ముఖ్య పదవిని అలంకరించబోతున్నారు అని అంటున్నారు. జిల్లాలో పరిటాల శ్రీరామ్ కి ఇది రాజకీయంగా కీలకమైన బాధ్యత అని అంటున్నారు. 2029 లో పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. దాంతో మరో రెండున్నరేళ్ళలో జరిగే ఆ ఎన్నికల కంటే ముందుగా ప్రజా జీవితంలో అధికార హోదాలో శ్రీరామ్ మరింతగా జనాలకు దగ్గర అయ్యేందుకు ఇది మంచి అవకాశం అని అంటున్నారు. దాంతో పరిటాల వర్గీయులలో హర్షం వ్యక్తం అవుతోంది. రానున్న రోజుల్లో శ్రీరామ్ రాజకీయ ఎదుగుదలకు ఇది తొలి మెట్టుగా అంతా భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా శ్రీరామ్ కి టికెట్ రాలేదు, సామాజిక సమీకరణల వల్ల సునీతకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఇపుడు పరిటాల కుటుంబానికి సరైన న్యాయం జరిగింది అని అంటున్నారు.