కట్టబొమ్మనగా కందుల దుర్గేష్ అదుర్స్

కట్టబొమ్మన అంటే విశిష్టమైన ఆహార్యంతో పాటు గంభీరమైన వాచకం ఉంటుంది. అలాగే రాజసంతో కనిపిస్తారు. ఇవన్నీ తన నటనలో పొందూరచారు మంత్రి దుర్గేష్.;

Update: 2026-03-06 17:25 GMT

ఆయన శాఖలోనే సాంస్కృతిక వ్యవహారాలు ఉన్నాయి. ఆయన పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలను చూస్తారు. ఇక ఆయన స్వతహాగా తనలోని కళను కూడా ఎంతో కలిగి ఉన్నారు. వెరసి మంత్రి కందుల దుర్గేష్ తనదైన పెర్ఫార్మెన్స్ తో అదరహో అనిపించేశారు. ఆ పాత్ర ఆషామాషీది కాదు వీర పాండ్య కట్ట బొమ్మన. దివంగత నేత తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ మూవీలో పుణ్యభూమి నాదేశం పాటలో స్వతంత్ర్య వీరుల పాత్రలను పోషించారు. అందులో వీర పాండ్య కట్ట బొమ్మన పాత్ర ఉంటుంది. మరి అలాంటి పాత్రను కందుల దుర్గేష్ అద్భుతంగా పోషించి ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులు ప్రజాప్రతినిధుల ప్రశంసలను అందుకున్నారు.

బడ్జెట్ సెషన్ ముగింపు వేళ :

ఇదిలా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని నిర్వహించిన ఆటవిడుపు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ కళా ప్రతిభను చాటారు. ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో మంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలిలో నటనతో అలరించారు.

అదృష్టం అంటూ :

కట్టబొమ్మన అంటే విశిష్టమైన ఆహార్యంతో పాటు గంభీరమైన వాచకం ఉంటుంది. అలాగే రాజసంతో కనిపిస్తారు. ఇవన్నీ తన నటనలో పొందూరచారు మంత్రి దుర్గేష్. అలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పండిచారు అని అంతా ప్రశమించారు. దేశభక్తికి నిలువెత్తు రూపం వీరపాండ్య కట్టబొమ్మన అని, పాంచాలకురిచ్చి యుద్ధంలో ఆయన చూపిన సాహసం చిరస్మరణీయమని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. అటువంటి మహనీయుడి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పడం విశేషం.

వహ్ వా అనిపించారు :

ఇక పుణ్యభూమి నాదేశం నమో నమామి పాటలో వివిధ పాత్రలను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, సునీల్ కుమార్ అంతా కలిసి ప్రదర్శించిన నటనకు వారు హావభావాలు పలికించిన తీరుకు అంతా చప్పట్లతో స్వాగతం పలికారు.


Tags:    

Similar News