బీహార్ సక్సెస్...బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ?
ఇక తొందరలో దేశంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అస్సాం పాండిచ్చేరిలలో బీజేపీ అధికారంలో ఉంది.;
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరసగా రాష్ట్రాలను జయించుకుని వస్తోంది. మొత్తం 28 రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో బీజేపీ రాజకీయ విస్తరణ చాలా బలంగా సాగుతోంది. బీజేపీ తన మిత్రులతో కలిపి 28 రాష్ట్రాలలో ఇరవైకి పైగా ఉంది. కాంగ్రెస్ సొంతంగా మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉంటే ఇండియా కూటమి మిత్రులు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులలో అధికారంలో కొనసాగుతున్నారు పంజాబ్ లో ఆప్ అధికారంలో ఉంది. ఈ విధంగా లెక్క తీస్తే బీజేపీ మూడింట రెండు వంతులు రాష్ట్రాలలో తన కాషాయ జెండాను ఎగవేసింది అని చెప్పాలి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలలో ఢిల్లీ, పాండిచ్చేరిలో బీజేపీ అధికారంలో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారం సొంతం చేసుకుంది.
బెంగాల్ టార్గెట్ :
ఇక తొందరలో దేశంలో నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అస్సాం పాండిచ్చేరిలలో బీజేపీ అధికారంలో ఉంది. మిగిలిన మూడింటిలో ఇండియా కూటమి మిత్రులు పవర్ లో ఉన్నారు. ఇందులో కనీసంగా రెండు స్టేట్స్ ని తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ ఫస్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్న సంగతి తెలిసిందే. అక్కడ బీజేపీకి 2021 ఎన్నికల్లోనే 78 సీట్లలో పవర్ ఫుల్ ప్రతిపక్ష స్థానం దక్కింది. దాంతో ఈసారి ఆ నంబర్ ని డబులు చేసుకుంటే చాలు బెంగాల్ అధికారం కమలం పరం అవుతుంది అని లెక్కలు ఉన్నాయి. బీజేపీకి గ్రాఫ్ బాగా పెరుగుతోంది అన్నది తాజా అంచనాలు చెబుతున్నాయి. దానిని సానుకూలం చేసుకుంటే బెంగాల్ గడ్డ మీద కాషాయం జెండా పాతాలని బీజేపీ చూస్తోంది.
తమిళ సీమలో :
అంతే కాదు తమిళనాడులో డీఎంకే ని గద్దె నుంచి దించాలని బీజేపీ పంతం పట్టింది. అందుకే అన్నా డీఎంకేతో జట్టు కట్టింది. అన్నా డీఎంకేకి గ్రౌండ్ లెవెల్ లో మంచి బలం ఉంది. సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. ఆ పార్టీ ఆసరాతో బీజేపీ ఇమేజ్ తో పలుకుబడిని కూడా గట్టిగా వాడితే తప్పకుండా తమిళనాడులో ఎన్ డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అన్నది బీజేపీ పక్కా ఆలోచనగా ఉంది అని చెబుతున్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ విజయ్ పెట్టిన టీవీకే పార్టీ ప్రభావం ఎక్కువగా డీఎంకే మీదనే ఉంటుంది అని బీజేపీ అంచనా కడుతోంది. అలా విజయ్ ఓట్లు ఎంతలా చీలిస్తే అంతలా ఎన్డీయే కూటమి లాభపడుతుంది అని లెక్కలు ఉన్నాయట. మొత్తంగా చూస్తే కమల ఉత్సాహం చాలా ఎక్కువగానే ఉంది. బీహార్ లో అధికారం దక్కించుకోవడం అన్న కలను తీర్చుకున్న బీజేపీ పశ్చిమ బెంగాల్ తమిళనాడులలో కూడా రాజ్యం చేపడితే సుదీర్ఘ కాలంగా లక్ష్యాలుగా ఉన్నవి సాకారం అయినట్లే అంటున్నారు.