మోడీ కేబినెట్ లో భారీ మార్పులు ?

తొలి విడతలో 37 ఖాళీలకు జరుగుతున్నాయి. మరి విడతలో మరో 37 దాకా సీట్లకు ఎన్నికలు ఉంటాయి. ఈ రెండు విడతలలో కూడా మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది అని అంటున్నారు.;

Update: 2026-03-06 17:39 GMT

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. మరొక మూడు నెలలలో ప్రభుత్వం ఏకంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది. 2024 జూన్ 9న మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక మోడీ మంత్రి వర్గంలో 2024 జూన్ 9న మొత్తం 76 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో కేబినెట్ మంత్రులు ముప్పై మంది ఉంటే, అయిదుగురు ఇండిపెండెంట్ చార్జీతో కేంద్ర మంత్రులుగా, మరో 41 మంది కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్నారు.

పునర్ వ్యవస్థీకరణ :

ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రుల పనితీరు మీద ఒక అంచనా అయితే ఉంటుంది. దాంతో పనితీరు ఆధారంగా ఈ మార్పులు ఉండవచ్చు అని అంటున్నారు. అంతే కాదు వివిధ రాష్ట్రాలలో రాజకీయ అవసరాలు మిత్రులకు చోటు కల్పించడం సామాజిక సమీకరణలు వంటివి కూడా మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణకు కారణంగా ఉండవచ్చు అని అంటున్నారు. అదే విధంగా కొన్ని కీలక శాఖల్లో మార్పులు తీసుకుని రావాలని అనుకుంటున్నారు అని అంటున్నారు.

ముహూర్తం అపుడేనా :

ఇక మంత్రివర్గంలో భారీ మార్పులు ఖాయమని తెలుస్తోంది. అయితే అది ఎపుడు అన్నదే చూడాల్సి ఉంది. ఎందుకంటే బడ్జెట్ సెషన్ రెండవ విడత ఏప్రిల్ 2వ తేదీ దాకా ఉంటుంది. ఆ తరువాత అయిదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. దాంతో ఎన్నికల ప్రచారంతో కేంద్ర బీజేపీ పెద్దలు ఫుల్ బిజీ అవుతారని అంటున్నారు.

రాజ్యసభ ఖాళీలకు ఎన్నికలు :

దాంతో పాటుగా రాజ్యసభ రెండవ విడత ఖాళీలకు జూన్ లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 37 ఖాళీలకు జరుగుతున్నాయి. మరి విడతలో మరో 37 దాకా సీట్లకు ఎన్నికలు ఉంటాయి. ఈ రెండు విడతలలో కూడా మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది అని అంటున్నారు. అలా రాజ్యసభకు కొత్తగా నెగ్గిన వారిలో కీలక నేతలకు మంత్రి వర్గంలో బెర్తులను కేటాయించాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఉదాహరణకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటూ రాజ్యసభలో అడుగు పెడుతున్న నితీష్ కుమార్ కి కేంద్ర మంత్రి వర్గంలో తప్పనిసరిగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ఇది రాజకీయ అనివార్యతగా ఉంది.

మాజీ బ్యూరో క్రాట్లకు చెక్ :

ఇక మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. బ్యూరోక్రాట్లు గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి కేంద్రంలో మంత్రి పదవులు అందుకున్న వారు ఉన్నారు వారి పనితీరు తో పాటు ఇతర అంశాలను కూడా బేరీజు వేసుకుంటూ వారిలో కొందరికి మంత్రి వర్గం నుంచి తప్పిస్తారు అని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో జనాదరణ ఉంటూ సామాజికంగా రాజకీయంగా విశేష ప్రభావం చేసే వారికి చోటు ఇస్తారని అంటున్నారు. ఇక కేరళ నుంచి ఎంపీ అయిన ప్రముఖ సినీ నటుడు సురేష్ గోపీ వంటి వారు తమకు మంత్రి పదవి వద్దు అని చాలా కాలంగానే చెబుతూ వస్తున్నారు. దాంతో వారి విషయంలో కూడా కేంద్రం ఆలోచన చేయవచ్చు అని అంటున్నారు.

ఎవరు ఇన్ ఎవరు అవుట్ :

ప్రధానంగా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కూడా చూసుకుంటూ ఎవరిని రాష్ట్రంలో ఉంచాలి ఎవరిని కేంద్రానికి తీసుకుని రావాలి అన్న లెక్కలు కూడా కేంద్ర బీజేపీ పెద్దలు వేసుకుంటారని అంటున్నారు. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులే ఉంటాయని అంటున్నారు. మరి ఎవరు ఇన్ ఎవరు అవుట్ అంటే మాత్రం తలపండిన రాజకీయ నేతలే చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న 76 నెంబర్ లో మూడవ వంతు మందికి మాతం చెక్ పెట్టడం ఖాయమని అదే ప్లేస్ లో కొత్త వారిని తీసుకుని వస్తారని ప్రచారం అయితే హస్తిన వర్గాలలో సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News