ఆషాడంలో ప్రారంభోత్సవమా...వాయిదా వేయండి !

దీని మీద తెలుగు శక్తి సంస్థ అధ్యక్షుడు బీవీ రామ్ మాట్లాడుతూ ఆషాడం మంచిది కాదు ఎయిర్ పోర్టు ఓపెనింగ్ ని వాయిదా వేయాలని కోరారు.

Update: 2026-07-22 17:02 GMT

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ ని కూటమి ప్రభుత్వం చెబుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ని ఆగస్టు 1న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే దీని మీద పలువురు శుభ ముహూర్తాల గురించి చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఆషాడమాసం కొనసాగుతోంది. హిందూ శాస్త్రం ప్రకారం ఆషాడం అంటే శూన్య మాసం. ఎలాంటి శుభ కార్యాలూ ఈ నెలలో తలపెట్టారు. అటువంటిది అతి పెద్ద ప్రాజెక్టు అయిన ఎయిర్ పోర్టుని ఓపెన్ చేయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

నరేంద్ర మోడీకి లేఖ :

దీని మీద తెలుగు శక్తి సంస్థ అధ్యక్షుడు బీవీ రామ్ మాట్లాడుతూ ఆషాడం మంచిది కాదు ఎయిర్ పోర్టు ఓపెనింగ్ ని వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ వివరాలను ఆయన వెల్లడిస్తూ జ్యోతిష్య శాస్త్రపరంగా మంచి ముహూర్తాలు లేని శూన్య మాసంలో ప్రారంభోత్సవం తగదు అన్నారు. హిందూ మతాన్ని సంప్రదాయాలను ఆచరించేవారు ఎవరూ ఆషాడమాసంలో ప్రారంభోత్సవాలు శుభ కార్యాలు చేయరని గుర్తు చేశారు. అది సమాజానికి ప్రభుత్వానికి కూడా మంచిది కాదని హితవు చెప్పారు.

హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకం :

హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకించడం మంచిది కాదని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కి పూర్తిగా సన్నద్ధంగా లేదని ఆయన చెప్పారు. ఇంకా అనేక పనులు పెండింగులో ఉన్నందువల్ల కొన్నాళ్ళు వాయిదా వేయడంలో తప్పేమీ లేదని అన్నారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో విశాఖ ప్రజలు ఎయిర్ ట్రావెలర్స్ అభిప్రాయం కూడా తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయలో కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి పార్లమెంట్ లో కేంద్రం చెబుతున్న వివరాలకు పొంతన లేదని బీవీ రామ్ అన్నారు. పాతిక నెలలలో 23 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతూంటే కేవలం 6,962 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని పార్లమెంట్ లో లెక్కలు చెబుతున్నాయని అన్నారు.

Tags:    

Similar News