రేవంత్ గారూ.. మా ఆస్తులు రాసిస్తాం..: కేటీఆర్ బిగ్ ఆఫ‌ర్‌

ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా కేటీఆర్ తిప్పికొట్టారు. ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ హైద‌రాబాద్‌కు 70 కిలో మీట‌ర్ల దూరంలో ఉంటుంద‌న్నారు.

Update: 2026-09-19 02:47 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ఆస్తులు ల‌క్షల‌ కోట్ల రూపాయ‌ల‌కు ఉంద‌ని.. చెబుతున్నార‌ని.. ఆ ఆస్తుల‌న్నీ తాము రాసిస్తామ‌ని.. త‌మ‌కు వెయ్యి కోట్లు ఇస్తే చాలని వ్యాఖ్యానించారు. తాజాగా ఫార్ములా-ఈరేస్ కేసు వ్య‌వ‌హారంపై విచార‌ణ‌లో భాగంగా కేటీఆర్ నాంప‌ల్లి కోర్టుకు వ‌చ్చారు. విచార‌ణ అనంత‌రం.. కోర్టు బ‌య‌ట‌.. మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ కు స‌వాల్ రువ్వారు.

``కేసీఆర్ ఆస్తులు.. మా ఆస్తులు ల‌క్ష‌ల కోట్లు ఉన్నాయ‌ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. పోనీ.. ల‌క్ష కోట్లే అనుకుందాం. మాకు వెయ్యి కోట్లు ఇచ్చి.. మిగిలిన 99వేల  కోట్ల రూపాయ‌ల‌ను మీరు తీసుకోండి., ఆ సొమ్ముల‌ను మీరు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌లు కు వినియోగించండి. మీరు ఎక్క‌డ సంత‌కం చేయ‌మ‌న్నా.. చేస్తాం. ఇప్పుడు రెడీ అంటే.. ఇప్పుడే రెడీ. లేదా మీరు టైం పెట్టండి.`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఎప్పుడో కొన్నారు..

ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా కేటీఆర్ తిప్పికొట్టారు. ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ హైద‌రాబాద్‌కు 70 కిలో మీట‌ర్ల దూరంలో ఉంటుంద‌న్నారు. ఎప్పుడో త‌న చిన్న‌ప్పుడే.. కేసీఆర్ ఎక‌రాకు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున చెల్లించి కొనుగోలు చేశార‌ని చెప్పారు. ఇప్పుడు ధ‌ర పెరిగి ఉంటుం దన్నారు. ఆ సొమ్ము కూడా కేసీఆర్ క‌ష్టార్జిత‌మేన‌న్నారు. అయినా.. ఎవ‌రినీ అడ్డం పెట్టి అధికారంలోకి రాలేద‌ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

అసెంబ్లీలో ఒక మాట‌.. బ‌య‌ట ఒక‌టా?

రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక‌టి చెబుతున్నారు.. బ‌య‌ట ఒక‌టి మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టా రు. కేసీఆర్‌కు వెయ్యి ఎక‌రాలు ఉన్నాయ‌ని.. ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కానీ.. అసెంబ్లీలో మాత్రం 67 ఎక‌రాలే ఉన్న‌ట్టు లెక్క‌ల‌తోపాటు చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. రెండు నాల్క‌ల ధోర‌ణి ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను పెట్టుబ‌డుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. త‌న‌పై కేసులు పెడుతున్నార‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News