• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాతబస్తీ రౌడీషీటర్ల...

పాతబస్తీ రౌడీషీటర్ల ఇంట్లో పోలీసుల సోదాలు.. షాకింగ్ సీన్లు

| అనూహ్య రీతిలో నిర్వహించిన సోదాల్లో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.

By - Tupaki Desk
Update: 2025-12-25 09:01 GMT

అనూహ్య రీతిలో నిర్వహించిన సోదాల్లో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ పాతబస్తీలోని రౌడీషీటర్ కం పహిల్వాన్.. అతని కొడుకుల ఇళ్లల్లో పోలీసు ఉన్నతాధికారుల నాయకత్వంలో సోదాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు మారణాయుధాలతో పాటు.. కీలక పత్రాల్నిస్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలో కరుడుగట్టిన రౌడీషీటర్ గా పేరున్న జఫర్ పహిల్వాన్.. అతని కొడుకులు సయిద్.. సులేమాన్ ఇళ్లల్లో డీసీపీ కిరణ్ ఖరే.. ఆయన టీం సోదాలు నిర్వహించారు.

రౌడీషీటర్ జఫర్ విషయానికి వస్తే.. ఇతను గతంలో పలు కుస్తీ పోటీల్లో పాల్గొనటమే కాదు.. విజేతగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ ఉంది. అదే సమయంలో రెండుసార్లు కానిస్టేబుల్ సర్వీససు నుంచి తొలగించిన ఘన చరిత్ర ఇతగాడి సొంతం కార్పొరేటర్ గా కూడా పని చేశాడు. ఇతడి మీద ఉన్న నేరారోపణలు అన్నిఇన్ని కావు.

అతని ఏరియా పరిధిలోఎవరైనా ఇంటి నిర్మాణం చేపడితే.. అతడికి మామూలు చెల్లించాల్సిందే. ఇంటికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పైసలు ఇచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో వారి ఇంటి నిర్మాణం ముందుకు సాగదని చెబుతుంటారు. ఇలా రౌడీయిజంతో పాటు.. మారణాయుధాలతో బెదిరింపులకు దిగటం ఇతనికి రోటీన్ గా చెబుతారు.

గతంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలోకి వెళ్లి పిస్టల్ కాల్పులు జరపటం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పదేళ్ల క్రితం జైలుకు వెళ్లాడు. ఇప్పటికి ఇతడిపై నలభైకు పైగా కేసులు ఉన్నాయని.. అతడి కొడుకులపైనా కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీసీపీ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలు మారణాయుధాలు దొరటం సంచలనంగా మారింది. ఈ లెక్కన.. పాతబస్తీ పరిధిలో నేరారోపణలు ఉన్న నేరస్తుల ఇళ్లల్లో మూకుమ్మడి సోదాలు నిర్వహిస్తే ఇంకెన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో?

Tags:    
  • hyderabadpolice 
  • oldcity 
  • rowdysheeter 
  • crimeraids 
  • lawandorder 

Similar News

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

Copyright @2026

Powered by Blink CMS