• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.....

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

| కేంద్ర సంక్షేమ పథకాలకు ఆధార్ స్థానంలో ఓటరు ఐడీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్రమంత్రి లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయం అమలైతే ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధులు, వలస కార్మికులు, నిరుపేదలకు కూడా కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

By - A.N.Kumar
Update: 2026-11-05 16:15 GMT

ఆధార్ కార్డ్.. దేశంలోని ప్రతీ పౌరుడి వద్ద ప్రస్తుతం ఈ భారత బయోమెట్రిక్ గుర్తింపు కార్డు ఉంది. ఇది లేనిదే ఎక్కడా పని జరగదు. అన్నింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాన ఐడీ కార్డుగా జనాలు వాడేస్తున్నారు. అంతడి ప్రాధాన్యం కలిగిన ఆధార్ కార్డును ఇప్పుడు కేంద్రం పక్కన పెట్టబోతోందా? దాని ప్లేసులో ఓటరు గుర్తింపు కార్డును తీసుకురాబోతోందా? అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం కేంద్రమంత్రి లలన్ సింగ్ తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాన ఐడీగా ఆధార్ కార్డ్ స్థానంలో ఓటరు ఐడీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొనడమే కారణం.

సాధారణంగా సంక్షేమ పథకాల్లో అక్రమాలను అరికట్టడం.. అనర్హులు లబ్ది పొందకుండా చూడడం.. నిజమైన అర్హులకు ప్రభుత్వ సాయం అందించడం వంటి లక్ష్యాలు ప్రభుత్వానికి ఉంటాయి. కానీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఓటరు ఐడీ లేని వారికి పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఎస్ఐఆర్ తో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. అది తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.

ఓటరు ఐడీ అనేది ప్రతీ భారతీయుడికి ఆటోమేటిక్ గా లభించే గుర్తింపు పత్రం కాదు.. ఓటు హక్కు పొందేందుకు నిర్ధేశించిన అర్హతలు.. ఓటరు జాబితాలో పేరు నమోదు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆధార్ కార్డ్ అందరికీ లభించేలా ఏర్పాట్లున్నాయి. కానీ ఓటరు ఐడీ ఎన్నికల వ్యవస్థలో ప్రస్తుతం ఎస్ఐఆర్ తో ముడిపడి ఉండడంతో అది అంత ఈజీగా వచ్చేలా లేదు. ఇప్పటికే దేశంలో సర్ ప్రక్రియతో కోట్ల ఓట్లను తొలగించారని ప్రతిపక్షాల ఆందోళనలతో వివాదాలున్నాయి. ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓటర్ ఐడీని సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేస్తే ఓటరు జాబితాలో పేరు లేని అర్హుల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అందరినీ కంగారు పెడుతున్న ప్రశ్న.

దేశంలో వలస కార్మికులు, నిరాశ్రయులు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు గుర్తింపు సమస్యలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. చిరునామా మారడం.. పత్రాలు అందుబాటులో లేకపోవడం.. పేర్లలో తప్పులు ఉండడం వంటి కారణాలతో ప్రభుత్వ పథకాల లబ్ధికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఓటరు ఐడీతోపాటు బయో మెట్రిక్ ధ్రువీకరణను కూడా తప్పనిసరి చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, శారీరక శ్రమ చేసే కార్మికులు, వేలిముద్రలు సరిగా పడని వ్యక్తులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ లో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. సాంకేతిక సమస్యల కారణంగా ఒక అర్హుడికి సంక్షేమ సాయం నిలిచిపోతే బాధ్యత ఎవరిది అన్న ప్రశ్న ఉత్పన్నవుతుంది.

సంక్షేమ పథకాలకు ఓటు హక్కు అర్హతగా మారితే చాలా మంది అర్హులు తొలిగిపోయే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.. ఇదే జరిగితే ప్రభుత్వంపై మరోసారి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచిస్తేనే మంచిదని నిపుణులు.. సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
  • aadhaarcard 
  • voterid 
  • governmentwelfareschemes 
  • lallansingh 
  • india 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS