• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  డెమోక్రాట్లు గెలిచారు...

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

| అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయ సవాలుగా మారింది. ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన డెమొక్రాట్లు ట్రంప్ ప్రభుత్వ విధానాలు, క్యాబినెట్ మంత్రులు, కుటుంబ వ్యాపారాలపై విచారణలకు సిద్ధమవుతున్నారు. అయితే ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటే సెనేట్‌లో 67 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఆ బలం లేకపోవడంతో ఆయన పదవికి తక్షణ ముప్పు లేదు.

By - A.N.Kumar
Update: 2026-11-06 03:56 GMT

‘తాను వలిచింది రంభ.. తాను మునిగింది గంగ’ అన్నట్టుగా ప్రపంచాన్ని తన వెర్రితో అతలాకుతలం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా ప్రజలే కర్రుకాల్చి వాతపెట్టారు. ఆల్ మోస్ట్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ల కంచుకోటల్లో సైతం చిత్తుచిత్తుగా ఓడించి గట్టి గుణపాఠం చెప్పారు. రిపబ్లికన్లను, ట్రంప్ ను ఘోరంగా ఓడించేశారు. ఇప్పటికైనా ట్రంప్ కు బుద్ది వస్తుందా? అంటే అదీ లేదు. తన మేకపోతు గాంభీర్యంతో డెమొక్రాట్ల బిల్లులను వీటోతో అడ్డుకుంటానని ఫిటింగులు పెడుతున్నాడు. దీంతో ట్రంప్ బుద్ది మారదని.. వచ్చేసారి కూడా రిపబ్లికన్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని.. అదీ కేవలం ట్రంప్ వల్లే సాధ్యమని ఘంఠాపథంగా చెబుతున్నారు.

మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సినిమా నడుస్తోంది. అదేంటయ్యా అంటే.. "వైట్‌హౌస్‌లో బాస్‌గా ట్రంప్ ఉన్నారు కానీ కాంగ్రెస్‌లో మాత్రం డెమోక్రాట్లు డప్పు మోగిస్తున్నారు".. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించడంతో ఇన్నాళ్లూ ఏకపక్షంగా సాగిన ట్రంప్ చక్రవర్తి పాలనకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఇకపై ఆయన ప్రశాంతంగా నిద్రపోయే రోజులు పోయినట్లే..

అమెరికా ప్రతినిధుల సభను తమ గుప్పిట్లోకి తీసుకున్న డెమోక్రాట్లు ఏకంగా 240 సీట్లతో ఊచకోత కోశారు. దీంతో ట్రంప్ గారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఈ జోరు చూసి చాలామంది సోషల్ మీడియాలో "ఇక ట్రంప్‌ను వైట్‌హౌస్ నుంచి గెంటేయడమే తరువాయి" అని తెగ సంబరపడిపోతున్నారు. కానీ అసలు మ్యాటర్ అక్కడే ఉంది.

రాజ్యాంగం ప్రకారం ట్రంప్‌ను అధ్యక్ష పీఠం నుంచి దించాలంటే అంత ఆషామాషీ కాదు. హౌస్‌లో మెజారిటీ వస్తే సరిపోదు. సెనేట్‌లో ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ అంటే 67 ఓట్లు కావాలి. కానీ అక్కడ డెమోక్రాట్ల బలం కేవలం 54 సీట్లకే పరిమితమైంది. అంటే ట్రంప్‌ను ఇంటికి పంపాలంటే సొంత రిపబ్లికన్ పార్టీ నుంచి కనీసం 13 మంది వచ్చి "మా వాడే తప్పు చేశాడు.. తీసేయండి" అని చేతులెత్తాలి. అమెరికా రాజకీయాల్లో ప్రత్యర్థులు హ్యాండ్ ఇవ్వడం సర్వసాధారణమే అయినా సొంత పార్టీ వాళ్లే దెబ్బకొట్టడం అంత సులభం కాదు. కాబట్టి ట్రంప్ గద్దె దిగిపోయే ప్రమాదం ప్రస్తుతానికి లేనే లేదు.

అయితే పదవి పోలేదు కదా అని ట్రంప్ రిలాక్స్ అవడానికి వీల్లేదు. డెమోక్రాట్లు కుర్చీ లాక్కోలేకపోయినా రోజూ ఆ కుర్చీకి కింద నిప్పు మాత్రం పెట్టగలరు. ఇమిగ్రేషన్ విధానాల నుంచి మొదలుపెట్టి క్యాబినెట్ మంత్రుల లీలలు.. ట్రంప్ కుటుంబ సభ్యుల వ్యాపారాల వరకు ప్రతి దానిపై విచారణల మోత మోగించడానికి వాళ్లు రెడీ అవుతున్నారు. వైట్‌హౌస్‌కు ప్రతీరోజూ కొత్త తలనొప్పులు.. పార్లమెంటరీ కమిటీల ఉచ్చులతో ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.

ట్రంప్ అధ్యక్ష కుర్చీకి ఏం ఢోకా లేదు.. ఆయన కుర్చీ సేఫ్‌గానే ఉంది. కానీ ఆ కుర్చీ కింద మేకులు పాతేయడానికి డెమోక్రాట్లు సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్లూ అందరికీ చుక్కలు చూపించిన ట్రంప్‌కు.. ఇకపై రోజూ పొద్దున్నే రాజకీయ చుక్కలు చూపించే బాధ్యతను మాత్రం డెమోక్రాట్లు భుజాన వేసుకున్నారు. మున్ముందు అమెరికా రాజకీయం యమ రంజుగా సాగడం ఖాయం.. చూసి ఎంజాయ్ చేయడమే మన వంతు.. రెడీగా ఉండండి..

Tags:    
  • donaldtrump 
  • usmidtermelections 
  • democrats 
  • republicans 

Similar News

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

నిజమే.. ఇండియన్ ఇన్వేషన్‌కు ఖచ్చితంగా హద్దుల్లేవు.. యూఎస్ లో ఈ వీడియోనే సాక్ష్యం

2026-11-01 05:21 GMT

Copyright @2026

Powered by Blink CMS