• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  బ్యాలెట్ పేపర్లే.. కానీ...

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

| 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశం మనది.. అందులో 100 కోట్ల మంది ఓటేసినా లెక్కించడానికి నెలలు పడుతుంది.

By - Tupaki Desk
Update: 2026-11-04 18:00 GMT

150 కోట్ల మంది జనాభా ఉన్న దేశం మనది.. అందులో 100 కోట్ల మంది ఓటేసినా లెక్కించడానికి నెలలు పడుతుంది. అందుకే మనం ఈవీఎం యంత్రాలు వాడుతున్నాం. మరి 35 కోట్ల మంది జనాభా ఉన్న అగ్రరాజ్యం ఇలాంటి యంత్రాల జోలికి వెళ్లకుండా కేవలం బ్యాలెట్ పేపర్లతోనే ఓటింగ్ నిర్వహిస్తోంది. కోట్ల మంది ఓటేసినా ఫలితాలు మాత్రం రాకెట్ స్పీడులాగా వస్తూనే ఉన్నాయి. అసలు అమెరికా ఎన్నికల్లో ఇంత వాయువేగంతో ఫలితాలు ఎలా వస్తున్నాయి? దీని వెనుకున్న కథాకమామిషు ఏంటీ అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి. ఎందుకంటే ప్రపంచాన్ని పెను ప్రభావితంచేసే మనుషులు, అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు. యుద్ధం జరుగుతున్న ఇరాన్ వేయికళ్లతో ట్రంప్ ఓడిపోవాలని కోరుకుంటోంది. 100 శాతం టారిఫ్ లు వేసిన భారత్ కూడా అమెరికాలో ట్రంప్ దిగిపోవాలని ఉబలాటపడుతోంది. చైనా సహా ఇతర అమెరికా పడని దేశాలు కూడా అదే ఆలోచిస్తున్నాయి.

అయితే కోట్లాది మంది ఓటర్లు.. పేపర్ బ్యాలెట్లు.. వేలాది పోలింగ్ కేంద్రాలు అయినా ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఫలితాల సరళి స్పష్టమవుతుంది.. ఎక్కడ చూసినా పేపర్ బ్యాలెట్ నే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అమెరికాలో అస్సలు వాడరు. మరి అలాంటప్పుడు ఇంత వేగంగా ఫలితాలు ఎలా సాధ్యమవుతాయన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

అమెరికా ఎన్నికల విధానంలో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న బాక్సులో మార్క్ చేస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ ను ప్రత్యేక స్కానింగ్ యంత్రంలోకి పంపిస్తారు. ఇదే ‘ఆప్టికల్ స్కానింగ్ టెక్నాలజీ’. ఈ యంత్రాలు బ్యాలెట్ పై ఉన్న గుర్తులను చదివి ఓట్లను అభ్యర్థుల వారీగా నమోదు చేస్తాయి. ఈ హైస్పీడు స్కానర్లు గంటకు వేలాది బ్యాలెట్ పేపర్లను ప్రాసెస్ చేయగలవు. దీంతో ప్రతీ బ్యాలెట్ ను చేతితో లెక్కించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో బ్యాలెట్ పత్రాలను భద్రపరచడం మరో కీలకమైన అంశం. అవసరమైతే మళ్లీ వాటిని మ్యానువల్ గా లెక్కించి ఫలితాలను ద్రువీకరించుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతో పారదర్శకత ఎక్కువ.

ఇక అమెరికా ఫలితాలు వేగంగా రావడానికి మరో ముఖ్యకారణం ముందస్తు ఓటింగ్ విధానం. ఎన్నికల రోజునే ఓటు వేయాలనే నిబంధనల అక్కడ లేదు. ఓటర్లు వారాల ముందుగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయవచ్చు. పోస్టల్, మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. ఈ విధానంతో పోలింగ్ రోజున ఒకేసారి భారీ సంఖ్యలో బ్యాలెట్లు రావు. ముందస్తుగానే అనేక రాష్ట్రాల్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ల ఓటరు వివరాలు, సంతకాలు, నిబంధనలు తఖిఖీ చేసి స్కానింగ్ కు సిద్ధంగా ఉంచుతారు. పలితంగా పోలింగ్ ముగిసిన వెంటనే డేటా క్షణాల్లో లెక్కింపులోకి వస్తుంది.

ఇలా ఎన్నికల్లో వేగంగా స్కానింగ్ యంత్రాల ద్వారా పేపర్ బ్యాలెట్లతోనే లెక్కింపు సాగుతుంది. పారదర్శకత, స్కానింగ్ టెక్నాలజీ వేగం, ముందస్తు ఓటింగ్ ద్వారా అమెరికా ఓటింగ్ విధానం సాగుతుంది. ఓటు పేపర్ పైన పడినా.. లెక్కింపు మాత్రం డిజిటల్ వేగంతో సాగడమే అమెరికా ఓటింగ్ సిస్టమ్ లోని ప్రత్యేకతగా చెప్పొచ్చు.

Tags:    
  • uselections 
  • paperballots 
  • votingsystem 
  • opticalscanning 
  • electiontechnology 

Similar News

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

నిజమే.. ఇండియన్ ఇన్వేషన్‌కు ఖచ్చితంగా హద్దుల్లేవు.. యూఎస్ లో ఈ వీడియోనే సాక్ష్యం

2026-11-01 05:21 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS