• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  భారతీయులతో...

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

| నువ్వు ఎవరితోనైనా పెట్టుకో కానీ.. ‘బాల్య మిత్రులు’ ఉన్నోడితో మాత్రం పెట్టుకోకు అని అదేదో సినిమాలో ‘వేణుమాధవ్’ ఓ పాపులర్ డైలాగ్ వదులుతాడు.

By - A.N.Kumar
Update: 2026-11-04 10:57 GMT

నువ్వు ఎవరితోనైనా పెట్టుకో కానీ.. ‘బాల్య మిత్రులు’ ఉన్నోడితో మాత్రం పెట్టుకోకు అని అదేదో సినిమాలో ‘వేణుమాధవ్’ ఓ పాపులర్ డైలాగ్ వదులుతాడు. ఇప్పుడు ఈ డైలాగ్ మన ట్రంప్ తాతకు సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆయన పెట్టుకోకూడని వారితో పెట్టుకున్నాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఏకంగా 30 ఏళ్లుగా రిపబ్లికన్ల కంచుకోటల్లో కూడా ట్రంప్ పార్టీ ఓడిపోయి తగిన గుణపాఠాన్ని పొందింది. దీనంతటికి కారణం ట్రంప్ వెర్రితలలతో వేసిన అడుగులు.. అహంకారపు చేష్టలు.. మాటలు.. అందుకే ఇప్పుడు అనుభవించేస్తున్నాడు..

అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికలు ట్రంప్ తాతకు కర్రుకాల్చి వాతపెట్టారు. ఈ ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి ఒక కీలకమైన సందేశాన్ని పంపాయి. ముఖ్యంగా భారతీయులపై అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత.. హెచ్1బీ వీసాల విషయంలో కొందరు మాగా మద్దతుదారులు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలు, చేష్టలు ట్రంప్ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగించాయని ఈ ఎన్నికలతో నిరూపితమైంది.

‘హౌడీ మోడీ’ అంటూ గత సారి ట్రంప్ కు మద్దతుగా ఏకంగా భారత ప్రధాని ప్రచారం చేసి ఆయనకు బాసటగా నిలిచారు. అప్పుడు భారతీయ అమెరికన్లు అంతా ట్రంప్ వెంట నడిచి గెలిపించారు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయాడు. అసలు పాత ట్రంప్ కు కొత్త ట్రంప్ కు తేడానే లేదు. మన శత్రుదేశం పాకిస్తాన్ తో కలవడం.. భారత్ పై 100 శాతం టారిఫ్ లు.. అమెరికాలోని భారతీయులపై వీసా సమస్యలు, హెచ్1బీ ఆంక్షలు సహా ఎన్నారైలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. భారతీయులపై ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక వివక్ష, జాత్యహంకార వ్యాఖ్యలు, భారత్ పై వ్యతిరేక ధోరణి విపరీతంగా పెరిగాయి. అవే ఇప్పుడు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని చావు దెబ్బ తీశాయని విశ్లేషఖులు భావిస్తున్నారు.

అమెరికాను భారతీయులు ఎప్పుడూ దోచుకోలేదు. మన టాలెంట్ తో అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టారు. మనవాళ్లు బాగుపడ్డారు. అయితే భారతీయ నిపుణుల విషయంలో ట్రంప్ సర్కార్ వ్యవహరించిన తీరుతో మొత్తం ఇండియన్ సమాజం ఈసారి రిపబ్లికన్ పార్టీకి దూరమైంది. పూర్తిగా డెమొక్రాట్ల వైపు తిరిగినట్టు ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమైంది.

ఇక అమెరికాలో భారతీయులు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు.. వ్యాపారులుగా, వైద్యులు, ఐటీ అగ్రస్థానంలోని సీఈవోలు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులుగా కూడా ఎదిగారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరంతా ఈసారి మూకుమ్మడిగా డెబొక్రాట్ల వైపు మరలడంతో రిపబ్లికన్ పార్టీకి మరణశాసనం లిఖించినట్టైంది.

అమెరికా ఎన్నికలు సందేశం ఒక్కటే.. భారతీయులతో పెట్టుకొని ఇప్పుడు ట్రంప్, ఆయన పార్టీ అనుభవిస్తోంది. మనవాళ్ల ఇన్ఫ్లూయేన్స్, ప్రభావం.. అమెరికన్ ఓటర్లలో కూడా ట్రంప్ తీరుపై వ్యతిరేకత ప్రస్ఫూటంగా కనిపించింది. భారతీయుల కృషిని తక్కువ అంచనావేసి.. వారిపై వివక్ష చూపి అమెరికన్ల ఓట్లు కొల్లగొడుదామనుకున్న ట్రంప్ ఇప్పుడు మూల్యంచెల్లించుకున్నాడు. భారతీయులపై వ్యతిరేత చూపిస్తే వారి ఓట్లే కాదు.. అమెరికన్ల ఓట్లు కూడా దూరం అయ్యాయన్న గుణపాఠం ట్రంప్ కు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగిస్తుందో లేదో చూడాలి.

Tags:    
  • donaldtrump 
  • usmidtermelections 
  • indianamericans 
  • republicanparty 

Similar News

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

యూరప్ తో వైరానికి పుతిన్ రెడీ అవుతున్నారా? ఆ హెచ్చరిక వెనుక ఏం జరిగింది?

2026-10-30 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS