• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  ఈజిప్టు హైవేపై డిజిటల్...

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

| ఈజిప్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

By - Tupaki Desk
Update: 2026-11-03 05:37 GMT

ఈజిప్టు రాజధాని కైరోలో ఓ సైబర్ దాడి కలకలం రేపింది. రద్దీగా ఉండే 26th of July Axis హైవేపై ఏర్పాటు చేసిన భారీ డిజిటల్ బిల్‌బోర్డ్‌ను హ్యాక్ చేసి అశ్లీల వీడియోలను ప్రసారం చేశారు. సాధారణంగా వాణిజ్య ప్రకటనలు కనిపించే స్క్రీన్‌పై అభ్యంతరకర దృశ్యాలు ప్రత్యక్షం కావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కొందరు వాహనాలు ఆపి వీడియోలు తీయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈజిప్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ కంపెనీ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురికావడంతోనే బిల్‌బోర్డ్‌పై అనధికారిక వీడియోలు ప్రసారమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ స్క్రీన్‌ను నిర్వహిస్తున్న స్థానిక సంస్థకు ఆ అంతర్జాతీయ కంపెనీతో ఒప్పందం ఉంది. ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ దాడి ప్రభావం ఈజిప్టుకే పరిమితం కాలేదు. ఇరాక్, మలేషియా, బ్రెజిల్‌లోని కొన్ని డిజిటల్ అడ్వర్టైజింగ్ స్క్రీన్లు కూడా ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. అయితే సంబంధిత కంపెనీ పేరు, మొత్తం ప్రభావిత స్క్రీన్ల సంఖ్యను వెల్లడించలేదు.

ఈ ఘటనను కేవలం అసభ్యకర వీడియోల ప్రసారంగా చూడలేం. ప్రస్తుతం డిజిటల్ బిల్‌బోర్డ్లు కేంద్ర సర్వర్ల ద్వారా పనిచేస్తున్నాయి. ఒకే కంటెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ హ్యాకింగ్‌కు గురైతే వేర్వేరు దేశాల్లోని స్క్రీన్లు కూడా ప్రమాదంలో పడవచ్చు. అందుకే బలమైన సైబర్ భద్రత, యాక్సెస్ నియంత్రణ, నిరంతర పర్యవేక్షణ ఇప్పుడు అత్యవసరంగా మారాయి.

ఒకప్పుడు ప్రకటనల కోసం ఉపయోగించిన బిల్‌బోర్డ్లే ఇప్పుడు సైబర్ దాడులకు వేదికగా మారడం డిజిటల్ ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త ముప్పును స్పష్టం చేస్తోంది.

Tags:    
  • egypt 
  • cairo 
  • cyberattack 
  • billboardhack 
  • cybersecurity 

Similar News

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

యూరప్ తో వైరానికి పుతిన్ రెడీ అవుతున్నారా? ఆ హెచ్చరిక వెనుక ఏం జరిగింది?

2026-10-30 05:49 GMT

వాల్‌మార్ట్, అమెజాన్‌కు గట్టి పోటీ? అమెరికా ఫుడ్, గ్రాసరీ డెలివరీ రంగంలో పెను సంచలనం

2026-10-30 03:56 GMT

కమలా హారిస్ పేరుపై ట్రంప్ ఎగతాళి.. ఓరీనీ నీ దుంపతెగ.. ఇలా తయారయ్యావేంటయ్యా సామీ

2026-10-29 09:09 GMT

Copyright @2026

Powered by Blink CMS