• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  మిడ్ టర్మ్ ఎన్నికల వేళ...

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

| అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దాడులు జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

By - A.N.Kumar
Update: 2026-11-03 07:23 GMT

మధ్యప్రాచ్యంలో శాంతి అనే పదం మళ్లీ ఆవిరైపోతోంది. పగలు, ప్రతీకారాల మంటల మధ్య అమాయకుల గుండెల్లో భయం నిజమై కూర్చుంటే... శతాబ్దాలుగా కన్నీళ్లు మాత్రమే నిండిన ఆ నేలపై మరోసారి మరణ మృదంగం మోగే సంకేతాలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి అలలపై పారేది కేవలం సముద్రపు నీరు మాత్రమే కాదు.. లక్షలాది కుటుంబాల భవిష్యత్తు ఆశలు.. ఇరాన్‌కు చెందిన ఖెష్మ్ ద్వీపంలో బాంబుల గర్జనలతో ఒక్కసారిగా ఆకాశం ఎరుపెక్కింది. అమెరికా గుట్టుచప్పుడు కాకుండా జరిపిన దాడులతో అక్కడి సామాన్య ప్రజల కళ్లలో నిద్ర కరువైంది. యుద్ధమంటే గెలుపోటములు కావు.. కేవలం శోక సముద్రమేనని తెలిసినా... అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో మరోసారి అమాయకుల జీవితాలు బలిపీఠం ఎక్కుతాయా అన్న ఆందోళన ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేస్తోంది.

 

మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న విరోధం మళ్లీ సైనిక చర్యలకు దారితీస్తోంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన ఖెష్మ్ ద్వీపంపై అమెరికా దళాలు రహస్యంగా పరిమిత దాడులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధ భయాలు నెలకొన్నాయి.

అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దాడులు జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమొక్రాట్లలో ఎవరు కాంగ్రెస్‌పై ఆధిపత్యం సాధిస్తారనేది తేలనుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా అమెరికాలో రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితులు, విదేశాంగ విధానం వంటి అంశాలు కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అతివాదులను సంతృప్తి పరచడానికి ట్రంప్ ఈ దాడులు చేసినట్టుగా విశ్లేషకులు అంచనావేస్తున్నారు.. అయితే యుద్ధాన్ని వ్యతిరేకించే మెజార్టీ ప్రజలు మాత్రం ఇరాన్ పై తాజా దాడులతో రిపబ్లికన్ ట్రంప్ వర్గానికి వ్యతిరేకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ దాడులు ఖచ్చితంగా ట్రంప్ కు మైనస్ అవుతుందని అంటున్నారు.

ఇక అమెరికా దాడుల్లో ఖెష్మ్ ద్వీపంలో ఐదు వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ 'ఐఆర్ఎన్ఏ' తెలిపింది. పేలుళ్ల సమయంలో ఆకాశంలో రెండు విమానాలు కనిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ తన సైనిక సామర్థ్యాన్ని ఈ ప్రాంతంలో పెంచుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడులు కేవలం రక్షణాత్మక చర్యలే తప్ప పూర్తిస్థాయి యుద్ధానికి సంకేతం కావు. వాణిజ్య నౌకల భద్రతను ఫణంగా పెడుతూ ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తిప్పికొట్టడానికే ఈ పరిమిత చర్యలు చేపట్టినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతుకు పైగా వాటా ఉన్న హోర్ముజ్ జలసంధి భద్రత ఇప్పుడు తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. ఖెష్మ్ ద్వీపంలో ఇరాన్‌కు చెందిన భూగర్భ క్షిపణి స్థావరాలు, నావికాదళ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వాణిజ్య నౌకలపై జరిగే దాడుల సామర్థ్యాన్ని దెబ్బతీయడమే అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల ఇరాన్ ఐఆర్.జీసీ దళాలు అమెరికా విమానంపై క్షిపణి ప్రయోగించడంతోనే ఆత్మరక్షణలో భాగంగా ఈ ప్రతీకార దాడులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

హోర్ముజ్ జలసంధి ముఖద్వారం వద్ద ఉన్న ఖెష్మ్ ద్వీపం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ భూగర్భ క్షిపణి స్థావరం, నావికాదళ స్థావరం, భారీ డీశాలినేషన్ ప్లాంట్ ఉన్నాయి. గతంలోనూ అమెరికా సైనిక దాడుల లక్ష్యంగా ఈ ద్వీపం నిలిచింది.

మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సెంట్రల్ కమాండ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.. ఈ ప్రాంతానికి అదనపు క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ సామగ్రిని తరలించినట్లు సమాచారం. సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఇటీవల వైట్‌హౌస్‌ను సందర్శించి ట్రంప్‌కు యుద్ధ పరిస్థితులపై వివరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై సైనిక చర్యను ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మరో భారీ యుద్ధానికి దిగేందుకు ట్రంప్ సుముఖంగా లేరని.. దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యమిస్తున్నారని సమాచారం.

ఇరాన్ ఉద్రిక్తతలు కాస్త సడలి.. చర్చల ద్వారా పరిష్కారం లభించవచ్చనే వార్తల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 7 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం.

హోర్ముజ్ జలసంధిలో సైనిక ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అమెరికా-ఇరాన్ తదుపరి అడుగుల వైపు ప్రపంచ దేశాలు ఆందోళనగా చూస్తున్నాయి.

Tags:    
  • usiranconflict 
  • iran 
  • qeshmisland 
  • hormuzstrait 
  • middleeasttensions 

Similar News

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

యూరప్ తో వైరానికి పుతిన్ రెడీ అవుతున్నారా? ఆ హెచ్చరిక వెనుక ఏం జరిగింది?

2026-10-30 05:49 GMT

వాల్‌మార్ట్, అమెజాన్‌కు గట్టి పోటీ? అమెరికా ఫుడ్, గ్రాసరీ డెలివరీ రంగంలో పెను సంచలనం

2026-10-30 03:56 GMT

కమలా హారిస్ పేరుపై ట్రంప్ ఎగతాళి.. ఓరీనీ నీ దుంపతెగ.. ఇలా తయారయ్యావేంటయ్యా సామీ

2026-10-29 09:09 GMT

Copyright @2026

Powered by Blink CMS