టీడీపీకి రాజుగారి గుడ్‌ బై ...వైసీపీ గూటికే

Update: 2019-03-02 17:24 GMT
ఇటీవ‌లి కాలంలో వ‌రుస షాక్‌ లు తింటున్న తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆయన రేపు వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.  టీడీపీ నుంచి నరసాపురం లోక్‌ సభ సీట్‌ ను రఘురామకృష్ణంరాజు ఆశించారు. ఐతే.. స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం.

కాగా, కొద్దికాలం క్రితం రఘురామకృష్ణం రాజు ఈ వార్త‌ల‌ను ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను వైసీపీలో చేరనున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని... అవి ఎందుకలా వస్తున్నాయో నాకు అర్థంకావడంలేదన్నారు. ``నేను టీడీపీలో చేరిన రోజే నాకు క్లారిటీ ఉంది... అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు క్లారిటీగా చెప్పారు... నేనే నరసాపురం టీడీపీ అభ్యర్థిని... ఇందులో ఎలాంటి అనుమానం లేదు` అని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీలో భ‌రోసా దొరక్క‌పోవ‌డంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయ‌న సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News