మేకపాటి ఫ్యామిలీ తప్పుకున్నట్లేనా....వైసీపీ సెర్చింగ్ !

మేకపాటి రాజమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బిగ్ షాట్. ఆయన 1980ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు.;

Update: 2025-12-25 10:30 GMT

మేకపాటి రాజమోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బిగ్ షాట్. ఆయన 1980ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మొదట్లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా 1989 తరువాత ఎంపీగానే తన ప్రస్థానం అని నిర్ణయించుకుని పార్లమెంట్ మెట్లెక్కారు. ఆయన మొత్తం తన రాజకీయ జీవితంలో అనేక సార్లు ఎంపీగా గెలిచారు. ఒంగోలు, నెల్లూరు నుంచి ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మేకపాటి 2009లో వైఎస్సార్ మరణం తరువాత జగన్ వైపు వచ్చారు. వైసీపీ నుంచి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి జగన్ తరువాత రెండవ ఎంపీగా పార్లమెంట్ లో నిలిచారు. ఆయన 2019లో తన ప్రత్యక్ష రాజకీయ జీవితానికి స్వస్తి పలికి తన పెద్ద కుమారుడు మేకపాటి గౌతం రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

మంత్రి అయినా కూడా :

ఇక జగన్ కి మంచి మిత్రుడుగా గౌతం రెడ్డి ఉండేవారు. నిజానికి ఆయన వల్లనే మేకపాటి కాంగ్రెస్ ని వీడి వైసీపీలో చేరారు అని చెబుతారు. అలా జగన్ కి పెద్దాయనకు వారధిగా ఉన్న గౌతం రెడ్డి 2019లో జగన్ ప్రభుత్వంలో కీలకమైన ఐటీ భారీ పరిశ్రమలు సహా అనేక శాఖలను నిర్వహించారు. అయితే ఆయన 2022లో హఠాత్తుగా మరణించడంతో వైసీపీకి మేకపాటి ఫ్యామిలీకి అది పెద్ద లోటుగా మారింది. గౌతం రెడ్డి ప్లేస్ లో తమ్ముడు విక్రం రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఇక ఆయన గెలిచాక మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దాంతో మేకపాటి ఫ్యామిలీలో కొంత అసంతృప్తి నాడే ఏర్పడింది అని చెప్పుకున్నారు.

ఓటమి తరువాత :

ఇక మేకపాటి ఫ్యామిలీ వైసీపీ ఓటమి తరువాత దూరం పాటిస్తోంది అని ప్రచారం సాగుతోంది. విక్రం రెడ్డి కూడా ఎక్కువగా వ్యాపారాలు చూసుకుంటూ వస్తున్నారు. దాంతో పాటుగా మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ముందే పార్టీని వీడిపోయారు. అలా నెల్లూరు జిల్లాలో ఎంతో పట్టు ఉండి నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలను శాసించే బలమైన కుటుంబం అయితే ఇపుడు వైసీపీ నుంచే కాదు రాజకీయాల నుంచి దూరం జరుగుతోంది అన్నదే హాట్ ప్రచారంగా ఉంది.

కారణాలు అవేనా :

ఇదిలా ఉంటే వైసీపీ నుంచి మేకపాటి ఫ్యామిలీ దూరం కావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు అధినాయకత్వం ఒంటెద్దు పోకడలతో పాటు తమకు గతంలోలా ప్రాముఖ్యత లేకపోవడం గౌతం రెడ్డి లేని లోటు మేకపాటి పెద్ద వారు కావడం వంటివి ఉన్నాయని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వ్యాపార వ్యవహారాలు బోలెడు ఆ ఫ్యామిలీకి ఉన్నాయని చెబుతున్నారు. వాటిని చూసుకోవడానికి ఇపుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటున్నారు. ఈ మధ్యనే నెల్లూరు వచ్చిన మేకపాటి వైసీపీ మీద తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. జగన్ పొగిడే వారిని కాకుండా పార్టీ కోసం పనిచేసేవారిని చేరదీయాలని సూచించారు. ఇవన్నీ చూసినపుడు అభిమానంతో పెద్దాయన చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు. దాంతో వైసీపీ సంబంధించి మేకపాటి బంధం ముగుస్తోందా అన్న సంకేతాలు ఇచ్చారా అన్నది మరో చర్చ.

వైసీపీ వేట :

ఇక మేకపాటి ఫ్యామిలీ అంటీ ముట్టినట్లుగా ఉండడంతో పెద్దా రెడ్ల రాజ్యమైన నెల్లూరు జిల్లాలో అంతే బలం ఉన్న రెడ్ల కోసం వైసీపీలో వేట మొదలైంది అని అంటున్నారు. టీడీపీలో ఉంటూ ఇపుడు కీలక స్థానంలో ఉన్న ఒక బడా కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకుని రావడానికి చూస్తున్నారు అని అంటున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. సో మేకపాటి ఫ్యామిలీ ఈ పరిణామాలను ఎలా చూస్తుందో అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News