లేడీస్ కోచ్ లో బుర్ఖా ధరించిన వ్యక్తి తప్పుడు పనులు... వీడియో వైరల్!
లేడీస్-ఓన్లీ అని రాసి ఉన్న కంపార్ట్మెంట్లలోకి పురుషులు ఎవరూ ప్రవేశించకూడదనే సంగతి తెలిసిందే.;
లేడీస్-ఓన్లీ అని రాసి ఉన్న కంపార్ట్మెంట్లలోకి పురుషులు ఎవరూ ప్రవేశించకూడదనే సంగతి తెలిసిందే. ఒక వేళ ఆ తరహా పనులకు ఎవరు పాల్పడినా వారంతా వెంటనే ఘెరావ్ చేస్తారు.. పోలీసులకు ఫిర్యాదులూ వెళ్తాయి! మహిళలకు మాత్రమే అనే బోర్డు కనిపించిన తర్వాత అటు వెళ్లడానికి ఏ పురుషుడూ ప్రయత్నించకూడదు. ఈ నేపథ్యంలో మహిళలకు మాత్రమే అనే కంపార్టుమెంట్లోకి ఓ వ్యక్తి బుర్ఖా ధరించి ప్రవేశించి, మహిళా ప్రయాణికులపై లైంగిక వేధింపులకు ప్రయత్నించడం సంచలనంగా మారింది.
అవును... ముంబై లోకల్ ట్రైన్ లో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... లేడీస్ కోచ్ లోకి ఓ వ్యక్తి బుర్ఖా ధరించి ప్రవేశించాడు. ఆ వ్యక్తి ఘట్కోపర్ స్టేషన్ సమీపంలో ఆ మహిళా కంపార్ట్ మెంట్ లో కి ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అతడు ఆ స్పెషల్ కోచ్ లోని మహిళా ప్రయాణికులపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని.. ఇది ఆ ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ సమయంలో నిందితుడు రద్దీ సమయంలో మహిళల కోచ్ ఎక్కి అనుమానాస్పదంగా ప్రవర్తించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ సమయంలో అప్రమత్తమైన ప్రయాణికులు అతన్ని ఎదుర్కొన్నప్పుడు.. తప్పించుకోవడానికి ప్రయత్నించాడని.. ఈ క్రమంలో పరిస్థితి గ్రహించి ఫైనల్ గా కదులుతున్న మరో రైలు లోకి దూకి పారిపోయాడని చెబుతున్నారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
ఇందులో భాగంగా... ఈ సంఘటన తీవ్ర ఆగ్రహంతో పాటు మహిళల భద్రతపై ఆందోళనలకు దారి తీసింది. ఈ సమయంలో ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ లో అధికారిక ఫిర్యాదు నమోదంది. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పీ.ఎఫ్.) దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో నిందితుడిని గుర్తించడానికి రైల్వే స్టేషన్ తో పాటు పరిశర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.