ఉక్కు మహిళ ఇందిరని అదే కృంగదీసింది !
ఆమె 1966 జనవరిలో తొలిసారి ప్రధాని అయి డైనమిక్ లీడర్ గా పాలన సాగించారు. 1977 మార్చి దాకా ఆమె పాలనే సాగింది.
ఈ దేశానికి వన్ అండ్ ఓన్లీ మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, భవిష్యత్తులో మహిళ్స్లు ప్రధాని స్థాయికి చేరుకుంటారో లేదో ఇపుడే చెప్పలేం, కానీ చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు అయితే మాత్రం ఏదో నాటికి వారు దేశాన్ని ఏలవచ్చు. కానీ ఇప్పటికి 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్వతంత్ర్య భారత దేశంలో మాత్రం ఇందిరదే గ్రేట్ రికార్డు. ఆమె ముందూ తరువాత అయితే ఎవరూ ఈ రోజు దాకా లేనే లేరు, ఉక్కు మహిళగా ఎంతో పేరు సంపాదించుకున్న ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31న తన ఇంట్లోనే తన సొంత అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురి అయ్యారు. ఇది జరిగి నాలుగు దశాబ్దాలు పైదాటినా జనం ఇంకా మరచిపోలేని విషాదంగానే మిగిలి ఉంది.
డైనమిక్ లీడర్ గానే :
ఆమె 1966 జనవరిలో తొలిసారి ప్రధాని అయి డైనమిక్ లీడర్ గా పాలన సాగించారు. 1977 మార్చి దాకా ఆమె పాలనే సాగింది. మధ్యలో ఒకసరి ఎన్నికలు వస్తే ఆమె మంచి మెజారిటీతో గెలిచారు. ఆమె ఆ సమయంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాజ భరణాల రద్దు కానీ బ్యాంకులను జాతీయం చేయడం కనీ ఆమెలోని సామ్యవాద ఆర్థిక విధానాల పంధాను తెలియచేశాయి. 1971లో పాకిస్థాన్ తో వచ్చిన యుద్ధంలో భారత్ ని విజేతగా నిలిపారు. బంగ్లాదేశ్ ని ప్రపంచ పటంలో కొత్త దేశంగా నిలపడంలో ఇందిరా పాత్ర ఎంతో కీలకంగా మారింది.
సంజయ్ మరణంతో :
అలాంటి ఆమె 1977లో జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. అయితే మూడేళ్ళు తిరగకుండానే గెలిచి మళ్లీ అధికారం అందుకున్నారు. అలా ఆమె ప్రధానిగా 1980లో అయిన కొద్ది కాలానికే అంటే 1980 జూన్ 23న న్యూఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో 33 ఏళ్ల సంజయ్ గాంధీ మరణించారు. అది ఆమెను ఎంతగానో కృంగదీసిన సంఘటన అని అంటారు. సంజయ్ అంటే ఇందిరాగాంధీకి అసలైన రాజకీయ వారసుడు. అత్యవసర పరిస్థితి సమయంలోనూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలోనూ సంజయ్ గాంధీ కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన కనుక జీవించి ఉంటే 1985లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్ధి అయ్యేవారు. ఆయనే ప్రధాని కూడా అయ్యేవారు. ఇక ఇందిరాగాంధీ ఆలానే కుమారుడి రాజకీయ భవిష్యత్తుని తీర్చిదిద్దారు. అది జరగాలని అనుకున్నారు. కానీ విధి మరో విధంగా తలవడంతో ఆమె కుమారుడుని మాత్రమే కాదు తన కలలను కూడా పోగొట్టుకుని ఒక సాధారణ తల్లిగా కన్నీరుమున్నీరయ్యారు. అలా ఇందిరాగాంధీ జీవితంలో ఆమె రాజకీయాల్లో సంజయ్ గాంధీ ప్రాధాన్యత ఆ మీదట ఆయన మరణం ఇందిరపై చూపిన ప్రభావం ఇవన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తం అయి ఉన్నాయి.
ఆ ముద్ర లేకుండానే :
ఇక ఇందిరాగాంధీ చివరి విడత పాలన అయితే ఆమె బలమైన ముద్ర లేకుండానే సాగింది అన్నది విమర్శలు చెప్పే మాట. ఒక విధంగా చూస్తే ఆమె నిర్వేదంగానే ఆ అయిదేళ్ళూ పాలించారు. సంజయ్ గాంధీని ఆమె తలచుకుంటూనే వ్యక్తిగతంతా ఎంతో కృంగిపోయారని చెబుతారు. ఆమె మాట మీద బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ మెత్తని స్వభావం కలిగిన వారు. అందుకే ఇందిర తన వారసుడిగా సంజయ్ నే ఎంచుకున్నారు. ఆయన లేని లోటుతోనే ఆమె తన ఆఖరి పాలనను పూర్తి చేశారు. ఇక ఆమె అక్టోబర్ 31న దారుణ హత్యకు గురి అయ్యేందుకు ఒక రోజు ముందు ఒడిషాలో పర్యటిస్తూ పూర్తిగా వైరాగ్యంతో కూడిన ప్రసంగం చేశారు. తన చివరి రక్తపు బొట్టుని కూడా దేశం కోసం ధారబోస్తాను అని ఆమె బహిరంగ సభలో చెప్పిన కొద్ది గంటలలోనే హత్య కావించబడ్డారు.