ఔరంగజేబు సమాధి చుట్టూ రాజకీయం.. బీజేపీ వ్యూహం ఏమిటి?

ఇదిలా ఉంటే ఛత్రపతి శంభాజీనగర్ (పాత పేరు ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని 2025 మార్చి నుంచి బీజేపీ నాయకులు,

Update: 2026-11-01 03:33 GMT

నిన్న బాబ్రీ మసీద్ నేడు ఔరంగజేబు సమాధి. ఒకటి సక్సెస్ అయింది. ఇపుడు మరొకటి బీజేపీ ఎత్తుకుంది. బాబ్రీ మసీదు యూపీలో బీజేపీకి బలమైన రాజకీయ స్థావరాన్ని ఇచ్చింది. ఔరంగజేబ్ సమాధి మహారాష్ట్రలో ఉంది. 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దాదాపుగా మెజారిటీ సాధించింది. అయితే మరోసారి గెలవాలని అనుకుంటోంది. అంతే కాదు అక్కడ హిందూత్వ బ్రాండ్ ఇమేజ్ తో తానే పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది అంటున్నారు. అందుకే ఈ ఇష్యూని ఎత్తుకుంటోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

మళ్లీ రాజుకున్న వివాదం :

ఎక్కడి ఔరంగజేబ్ మరెక్కడి సమాధి, అయినా ఇదే ఇపుడు బీజేపీకి ఎందుకు అవసరం అన్నది చర్చగా ఉంది. అయితే దీని మీద శివసేనతో పాటు కాంగ్రెస్ ఇతర పక్షాలు అధికారంలో ఉన్న బీజేపీ వైఖరిని తప్పు పడుతున్నాయి. కానీ ఈ సమాధి కూల్చివేతకు గడువు నిర్ణయించామని బీజేపీ మంత్రి నితేశ్ రాణే ప్రకటించేశారు. అంతే కాదు ఆ తేదీని సరైన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ప్రకటిస్తారని అన్నారు. ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నితేశ్ రాణే మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఈ వివాదం గట్టిగానే రాజుకుంటోంది. ఔరంగజేబ్ సమాధి తొలగింపుతో చరిత్రను మార్చలేమని ప్రతిపక్ష శివసేన (యూబీటీ) కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తుండగా మహారాష్ట్రలో ఆయన సమాధికి స్థానం లేదని అధికార పక్షంలోని కొందరు నేతలు వాదిస్తున్నారు

హిందూత్వ సంస్థల డిమాండ్లు :

ఇదిలా ఉంటే ఛత్రపతి శంభాజీనగర్ (పాత పేరు ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని 2025 మార్చి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే ఈ సమాధి భారత పురావస్తు సర్వేక్షణ శాఖ పరిధిలో జాతీయ ప్రాధాన్యత ఉన్న స్మారక చిహ్నంగా ఉంది. దీని చుట్టూ పోలీసులు ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో విధాలుగా కీలకంగా ఉన్న ఈ సమాధి మీద హిందూత్వ సంస్థలౌ కూల్చేస్తామని అంటున్నాయి. అధికార బీజేపీ అయితే తేదీని కూడా నిర్ణయిస్తామని చెబుతోంది.

సుదీర్ఘ పాలకుడు :

ఇక వెనక్కి వెళ్తే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు 17వ శతాబ్దం వారు. ఆయన సుమారు 49 సంవత్సరాల పాటు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది సుదీర్ఘమైన పాలనగానే చరిత్రలో ఉంది. ఆయన సమాధి గురించి విశేషాలు చూస్తే తాజ్ మహల్ వంటి భారీ కట్టడాలను నిర్మించిన ఇతర మొఘల్ రాజుల సమాధులతో పోలిస్తే ఔరంగజేబు సమాధి అత్యంత సాధారణంగా ఉంటుంది. ఆయన చివరి కోరిక ప్రకారం ఎలాంటి పైకప్పు లేకుండా కేవలం ఆకాశమే కప్పుగా ఉండేలా ఒక సాధారణ మట్టి దిబ్బపై ఈ సమాధిని నిర్మించారు. ఇక ఔరంగజేబ్ ఎంతో గౌరవించే ప్రసిద్ధ సూఫీ సెయింట్ షేక్ జైనుద్దీన్ షిరాజీ దర్గా ప్రాంగణంలోనే ఈ సమాధి ఉంది. ఔరంగజేబు తన చివరి రోజుల్లో టోపీలు కుట్టడం ఖురాన్ ప్రతులను చేత్తో రాయడం ద్వారా సంపాదించిన సొంత డబ్బుతోనే అంటే అప్పట్లో సుమారు 14 రూపాయల 12 అణాల ఖర్చుతోనే ఈ సమాధిని నిర్మించారు.

Tags:    

Similar News