నాడు మరమరాలు అమ్మాడు.. ఇప్పుడు జ్యోతిషుడై వందల కోట్లు సంపాదించాడు!

కర్ణాటలో ఫుల్ ఫేమస్ అయిన ఓ జ్యోతిషుడి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-02-08 07:59 GMT

కర్ణాటలో ఫుల్ ఫేమస్ అయిన ఓ జ్యోతిషుడి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వివాహేతర సంబంధంపై జరిగిన హింసాత్మక ఘర్షణలో ఒక వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలపై ఈ జ్యోతిషుడు కమలాకర్ భట్ తో పాటు మరో ముగ్గిరిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురూ.. సుచిత్రా నాయక్, లోకనాథ్, ఆకాష్ లుగా గుర్తించారు. ఈ సమయంలో ఈ జ్యోతిషుడి ప్లాష్ బ్యాక్ ఆసక్తిగా మారింది.

అవును... ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ కి చెందిన కమలాకర్ భట్ 2005కి ముందు గ్రామాల్లోనూ, జాతరల్లోనూ తమలపాకులు, మరమరాలు అమ్మేవాడట. ఈ క్రమంలో తనకు తెలిసినవారొకరు జోతిష్యం నేర్చుకోమని సలహా ఇచ్చాడట. దీంతో.. వెంటనే కేరళ వెళ్లి అక్కడ జోతిష్యం నేర్చుకున్న కమలాకర్ భట్.. అనంతరం గ్రామానికి తిరిగి వచ్చి ఆ వృత్తిని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మరింతగా ఫేమస్ అవ్వడం కోసం టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో అతని అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. అతని వద్ద జాతకాలు చెప్పించుకున్నవారి సంగతేమో కానీ.. ఇతడి జాతకం మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో అతడు సుమారు వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. బెంగళూరు, శివమొగ్గ, హుబ్బళ్లి లో ఆఫీసులు తెరిచాడని.. వీటికోసం నెలకు సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేస్తున్నాడని చెబుతున్నారు. అతని వద్ద ఏజెంట్లూ ఉన్నారని చెబుతున్నారు.

ఈ క్రమంలో సమస్యలున్నవారిని తీసుకొచ్చిన ఏజెంట్లకు కమిషన్లు ముట్టచెబుతాడని అంటున్నారు. ఈ క్రమంలోనే తొలుత తన వద్దకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చి, అనంతరం ఏజెంట్ గా మారిన సుచిత్ర నాయక్ అనే మహిళతో అక్రమ సంబంధం సాగించడం మొదలుపెట్టాడని చెబుతున్నారు. ఈ సమయంలో అందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్తపై దాడి చేయించగా.. ఈ దాడిలో ఆమె భర్త సోదరుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు! దీంతో.. కమలాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది..?:

సుచిత్ర అనే మహిళ సుమారూ 15 ఏళ్ల క్రితం మహేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబం కొంతకాలం బెంగళూరులో నివసించింది. ఈ క్రమంలోనే సుచిత్ర, కమలాకర్ భట్ ను కలిసిందని.. ఆ తర్వాత ఆమె తిరిగి గ్రామానికి వెళ్లిపోయినా వీరి మధ్య స్నేహం చిగురించి, పెరిగిందని.. దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సుచిత్ర తన పిల్లలతో శివమొగ్గకు వెళ్లి అక్కడ కమలాకర్ భట్ తో నివసించిందట.

ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన కొన్ని ఆడియో ఫైల్స్ లో... వీరి బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే చర్చా జరిగినట్లు తెలుస్తోంది. దానికి తోడు.. తనకు తన తల్లితో ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని, తనను నిత్యం ఆమె తిడుతూ, కొడుతూ వేధిస్తుందని.. ఆమె కుమార్తె తన తండ్రి మహేష్ కు తెలిపింది. దీంతో.. ఆమెను తీసుకుని సిద్ధాపుర పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహేష్.. సుచిత్రపై ఫిర్యాదు చేయించాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు.

ఈ నేపథ్యంలోనే సుచిత్ర, ఆమె తండ్రి లోకనాథ్, ఆకాష్ లు కత్తులు, ఆయుధాలు తీసుకుని మహేష్ ఇంటికి చేరుకుని గొడవకు దిగారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతనిపై కత్తితో దాడి చేసే సమయంలో.. మహేష్ ను కాపాడటానికి ప్రయత్నించిన అతని సోదరుడు వసంత్ నాయక్ కు కత్తిపోట్లు తగిలాయి. ఇదే సమయంలో.. మహేష్ తో పాటు అతని స్నేహితుడు కుమార్ నాయక్ కూడా గాయపడ్డారు. ఈ క్రమంలో వీరి ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వసంత్ నాయక్ మరణించాడు!

Tags:    

Similar News