మంచుకొండల్లో మర్మం.. ఆసక్తి రేపుతున్న అస్థిపంజరాల సరస్సు..!

Update: 2021-03-01 14:30 GMT
హిమాలయాలు మనదేశానికి పెట్టని గోడలు.. ప్రకృతి ప్రసాదించిన ఓ అందమైన ప్రదేశం. అయితే హిమపర్వతాల్లో అనేక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. చాలా మంది ఇక్కడ మనశ్శాంతి దొరుకుతుందని అంటుంటారు. కొందరు యోగులు, రుషులు ఇక్కడ తపస్సు చేస్తూ మనశ్శాంతి పొందుతుంటారు.. ఇదిలా ఉంటే ఈ హిమపర్వతాల్లో అస్థిపంజరాల అవవేషాలతో కూడిన ఓ సరస్సు ఉంది. ఆ సరస్సులో అస్థిపంజరాలు ఎందుకున్నాయి..ఇంతకీ ఆ సరస్సు ఎక్కడుందో? ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో 'త్రిశూల్' అనే పర్వతం ఉంది. ఇది అతిపెద్ద పర్వతం. ఈ పర్వతం దిగువున, సముద్ర మట్టానికి 5,029 మీటర్ల (16,500 అడుగుల) ఎత్తులో 'రూపకుండ్' సరస్సు ఉంది. ఈ సరస్సులోనే వందలాది అస్థిపంజరాలు ఉన్నాయి.

మొదటి సారిగా 1942లో బ్రిటిష్​ అధికారి ఒకరు ఈ సరస్సులో అస్థిపంజరాలు ఉన్నట్టు గుర్తించారు.
అప్పటినుంచి ఈ సరస్సును లేక్ ఆఫ్ స్కెలెటన్స్ గా పిలుస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ సరస్సుపై పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.

నిజానికి చాలా రోజులపాటు ఈ సరస్సు మంచుతో గడ్డగట్టిపోయి ఉంటుంది. దీంతోఇక్కడ పరిశోధనలు చేసే అవకాశం కూడా లేదు. అయితే మంచు కరిగినప్పుడు అస్థిపంజరాలు బయటకు వస్తుంటాయి.

అయితే ఆ అస్థిపంజరాల్లో కొన్నింటికి మాంసం కూడా అంటుకొని ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇప్పటివరకూ, 600 నుంచీ 800 మంది మనుషుల అస్థిపంజరాల అవశేషాలు ఇక్కడ లభ్యమయ్యాయి.

దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నప్పటికీ ఇదో మిస్టరీగానే ఉండిపోయింది.ప్రభుత్వం మాత్రం దీన్ని ‘మర్మ సరస్సు’ పేరుపెట్టి.. పర్యాటకులను ఆకర్షిస్తుంది. తద్వారా ఆదాయం పొందుతుంది.

మర్మ సరస్సుపై అనేకకథనాలు..!

దాదాపు 870 ఏళ్ల క్రితం.. ఓ రాజు తన పరివారంతో ఇక్కడకు వచ్చారు. వాళ్లంతా ఓ సరస్సులో మునిగిపోయారు. ఈ అస్థిపంజరాలు వాళ్లవే అని ఓ కథ ప్రచారంలో ఉంది.

పూర్వం జరిగిన యుద్ధాల్లో కొందరు సైనికులు ఇక్కడ పడి మరణించి ఉంటారని మరికొందరు అంటుంటారు.


తాజా అధ్యయనంలో ఏం తేలింది?

తాజాగా ఇండియా, అమెరికా, జర్మనీల్లోని 16 పరిశోధనా సంస్థలకు చెందిన 28 మంది చరిత్రకారులు దీనిపై అధ్యయనం చేశారు.

ఇక్కడి అస్థిపంజరాలను జన్యుపరంగా విశ్లేషించారు. ఈ 38 మందిలో 15 మంది మహిళలు ఉన్నారు.
వీరి అవశేషాలను కార్బన్-డేటింగ్ చేయగా, కొన్ని అవశేషాలు 1,200 సంవత్సరాల నాటివని తేలింది.

అయితే వీరంతా ఒకే సమయంలో మరణించి ఉండకపోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News