యాభైఏళ్ల వయసులో రాహుల్ ఫిట్ నెస్ ఇంతలానా?

Update: 2021-03-01 11:30 GMT
మీడియాకు మించిన డ్యామేజ్ సోషల్ మీడియా మాత్రమే చేస్తుంది. కాంగ్రెస్ యువరాజును పప్పుగా అభివర్ణించటమే కాదు.. పప్పు అన్నంతనే ఆయన్ను గుర్తుకు వచ్చేలా చేసిన ఘనత సోషల్ మీడియాదే. నిజంగానే ఆయన పప్పునా? అంటే అదెంత తప్పన్న విషయాన్ని తన తాజా సౌత్ టూర్లో తన చేతలతో చేసి చూపిస్తున్నారు రాహుల్. దేశంలో ఏ రాజకీయ నేత అయినా కావొచ్చు.. అందునా యాభై ఏళ్ల వయసులో నడి సముద్రంలో ఈత కొట్టేంత ధైర్యం రాహుల్ కు మాత్రమే సాధ్యమేమో?

అది సరిపోదన్నట్లుగా తనకున్న ఫిట్ నెస్ రేంజ్ ఎంతన్న విషయాన్ని తాజాగా చూపించి అందరిని నోళ్లు వెళ్లబెట్టేలా చేశారు. అంతేకాదు.. పదిహేనేళ్ల అమ్మాయితో యాభై ఏళ్ల రాహుల్ పుష్ అప్స్ పోటీకి దిగి.. పోటాపోటీగా చేస్తే.. ఆ టీనేజర్ తేలిపోతే.. రాహుల్ నోరెళ్లబెట్టేలా చేశారు. ఇలాంటి మేజిక్కులు చేస్తూ.. తనకు సంబంధించి తరచూ ఏదో ఒక సర్ ప్రైజ్ చేస్తున్నారు.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల కష్టనష్టాల్ని అడిగి తెలుసుకోవటమే కాదు.. సమయానికి.. సందర్భానికి అనుగుణంగా ఆయన రియాక్టు అవుతున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఈ రోజున ములంగుమూడులోని సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఫిట్ నెస్ ఛాలెంజ్ విసరగా.. మెరిన్ షెలిఘో అనే టీనేజర్ పోటీకి దిగగా.. రాహుల్ అదరగొట్టేశారు. అంతేకాదు.. ఒక విద్యార్థిని తన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ ను ప్రదర్శించారు. అందరితో కలిసి డ్యాన్స్ చేశారు. మొత్తానికి యువరాజు.. పప్పు అనే ఇమేజ్ లు తుడిపేసుకొని.. తనను తాను సరికొత్తగా ప్రజంట్ చేసుకున్న రాహుల్.. రాజకీయ ఎత్తుగడలోనూ తన సత్తా ఎప్పుడు ప్రదర్శిస్తారో?



Tags:    

Similar News