పిల్లలు తప్పుచేస్తే పేరెంట్స్ కి శిక్ష ..చైనా కీలక నిర్ణయం !
ఎన్నెన్నో కఠినమైన చట్టాలతో నియంతృత్వ ధోరణి అవలంభిస్తోన్న చైనా , తాజాగా మరో సంచలన చట్టానికి రూపకల్పన చేసింది. పిల్లలు చెడుగా ప్రవర్తించడం లేదా నేరాలకు పాల్పడితే తల్లిదండ్రులను శిక్షించే చట్టాన్ని చైనా పార్లమెంట్ పరిశీలిస్తోంది. ఈ మేరకు ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా’ పేరుతో ముసాయిదాను రూపొందించింది. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ సంరక్షణలో ఉన్న పిల్లల చెడు, నేరపూరిత ప్రవర్తన ఒకవేళ నిర్దారణ అయితే ఈ చట్టం ప్రకారం ముందుకెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయవచ్చు.
కౌమారదశలో ఉన్నవారు తప్పుగా ప్రవర్తించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో దీని పై అవగాహన లేకపోవడం ప్రధాన కారణం అని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ కి చెందిన శాసన వ్యవహారాల కమిషన్ ప్రతినిధి జాంగ్ టైవే అన్నారు. ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా ముసాయిదాను ఎన్పీసీ స్టాండిగ్ కమిటీ ఈ వారం పరిశీలించనుంది. అలాగే, తల్లిదండ్రులు తమ పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, వ్యాయామం చేయడానికి సమయాన్ని ఏర్పాటు చేయాలని కూడా ముసాయిదాలో పేర్కొన్నారు.
ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియాలో సెలబ్రిటిలను గుడ్డిగా ఆరాధించడ సహా చెడు అలవాట్లకు బానిసలుగా మారిన యువతను అదుపు చేయడానికి తల్లిదండ్రుల అస్త్రాన్ని చైనా ప్రయోగించింది. ఇటీవల మైనర్ లకు ఆన్ లైన్ గేమింగ్ విషయంలో చైనా విద్యా శాఖ ఆంక్షలు విధించింది. వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే రోజుకు ఒక గంట పాటు మాత్రమే ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి అవకాశం కల్పించింది. అలాగే, హోంవర్క్ ను కూడా తగ్గించింది. వారాంతం, సెలవు దినాలలో ప్రధాన సబ్జెక్టు లకు తరగతులు తర్వాత ట్యూటరింగ్‌ను నిషేధించింది.
అదే సమయంలో యువకులు తక్కువ ఫెమినిజం, ఎక్కువ పురుష భావజాలం ఉండాలని చైనా విజ్ఞప్తి చేస్తోంది. కౌమారదశ లో అబ్బాయిల్లో ఫెమినిజాన్ని నిరోధించే ప్రతిపాదన’లకు చైనా ఇప్పటికే మార్గదర్శకాలను జారీచేసింది. అలాగే, సాకర్ వంటి క్యాంపస్ క్రీడలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది.