సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సొంత ఎంపీ

Update: 2021-05-12 12:21 GMT
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. తనపై విమర్శలు చేసే వారిపైనా.. ఘాటు ఆరోపణలు సంధించే వారిపైనా విరుచుకుపడుతుంటారు. డైలీ బేసిస్ లో రచ్చబండ పేరుతో.. తన వరకు వచ్చిన వివిధ అంశాలపై మాట్లాడతారు. ఈ సందర్భంగా తనపై ఎవరైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే ఉతికి ఆరేసినట్లుగా మాట్లాడుతుంటారు. గతంలో కాస్త జాగ్రత్తగా మాట్లాడే ఆయన.. ఇప్పుడు మాత్రం తరచూ ఆగ్రహానికి గురవుతున్నారు. గడిచినకొద్దిరోజులుగా వీరావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యన ఊహకు అందని రీతిలో తిట్ల దండకాన్ని చదివేస్తున్నారు.

తాజాగా ఆయన మాట్లాడిన వీడియోలో నాలుగు నిమిషాల నిడివి ఉన్న వీడియో బాగా సర్య్కులేట్ అవుతోంది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు ఆయన చేశారు. రెడ్డి సామాజిక వర్గంగా చెప్పుకునే జగన్.. రెడ్డి ఎలా అవుతారని ప్రశ్నించారు. జగన్ తండ్రి వైఎస్.. విజయమ్మల కుల ధ్రువీకరణ పత్రం మీద కాపులని ఉంటుందని.. అలాంటప్పుడు జగన్ రెడ్డి ఎలా అవుతారని ప్రశ్నించారు.

ఒకవేళ తాను చెప్పింది అబద్ధమైతే చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు. తనను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు. తనను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్న వారికి కౌంటర్ కూడా ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తనపై సోషల్ మీడియా ద్వారా దాడి చేయిస్తున్నారని.. అలాంటి వారిని ఎందుకు వదిలిపెడతానని ప్రశ్నించారు.
Read more!

‘మీకు మీరుగా కులం గురించి అనేసుకుంటే పోతుందా? ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చుకొని రెడ్డిని అనుకుంటే.. మీ తండ్రి.. తల్లి కులం మారిపోతుందా? మీకు మీరు అనేసుకుంటే సరిపోతుందా? మీ తండ్రిది.. తల్లి కాని కులం నీకెలా వచ్చిందిరా రెడ్డి? వెఎస్సార్ క్యాస్ట్ సర్టిఫకేట్ లో కాపుగా ఉంటే.. జగన్ రెడ్డి ఎలా అవుతారు?’’ అని ప్రశ్నించారు. జగన్ పిచ్చివాడన్న ఘాటు ఆరోపణ చేశారు. తాను చెప్పింది ఆధారాలతో నిరూపిస్తానని... ఆయన్ను కాదని సవాలు విసిరి పరీక్షలకు వెళ్లటానికి రెఢీనా? అడిగారు. ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయితే.. శిక్ష అనుభవించేందుకు సిద్దమన్నారు. కొంతకాలం క్రితం అమెరికాలోని ఒక ఆసుపత్రిలో జగన్ చికిత్స తీసుకున్నారని.. తన నోటినుంచి ఇలాంటి విషయాలు ఓపెన్ చేయించొద్దన్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మరి.. ఇంతటి తీవ్రమైన ఆరోపణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Full View
Tags:    

Similar News