మాయలేడీ.. ఇద్దరిని పెళ్లాడింది.. ప్రియుడితో జంప్!

ఇటీవల కాలంలో సిత్రమైన నేరాలకే కేరాఫ్ అడ్రస్ గా మారింది కర్ణాటక. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఈ కోవకు చెందిందే.;

Update: 2026-01-31 04:30 GMT

ఇటీవల కాలంలో సిత్రమైన నేరాలకే కేరాఫ్ అడ్రస్ గా మారింది కర్ణాటక. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఈ కోవకు చెందిందే. తన భార్య మోసం చేసి వేరే వారితో పరారైనట్లుగా ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాసేపటికే మరో వ్యక్తి వచ్చి.. తన భార్య కూడా కనిపించట్లేదని. .వేరే వారితో వెళ్లినట్లుగా వాపోయాడు. ఈ ఇద్దరు బాధితుల ఫిర్యాదుల్ని స్వీకరించిన పోలీసులకు.. అసలు విషయం అర్థమయ్యేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. కారణం.. ఆ ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేసింది ఒకే మహిళకే.

బెంగళూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన దొడ్డ బళ్లాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర ఉదంతం చోటు చేసుకుంది. తన భార్య తనను మోసం చేసిందని.. మరో వ్యక్తితో వెళ్లిపోయినట్లుగా అనంతమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కాసేపటికే అదే తరహాలో వీరే గౌడ్ అనే వ్యక్తి కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. ఒకే సమయంలో ఒకే తరహాలో ఫిర్యాదు రావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

తీరా.. ఈ ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేసింది ఒకే మహిళ గురించి అన్న విషయం అర్థమైంది. వీరిద్దరిని మోసం చేసిన సుధారాణి తాజాగా ప్రియుడితో పరారైనట్లుగా గుర్తించారు. వీరే గౌడ్ ను ప్రేమించి పెళ్లాడిన సుధారాణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు కారు.. బైకు నడపటం రాదన్న కారణంగా దూరం పెట్టింది. అదే సమయంలో డెలివరీ బాయ్ అనంతమూర్తితో లవ్ ట్రాక్ షురూ చేసింది. కొంతకాలం తర్వాత గుడిలో సింఫుల్ గా పెళ్లి చేసుకున్నారు

అతడితో ఏడాదిన్నర పాటు కాపురం చేసిన ఆమె.. అతని నుంచి రూ.20 లక్షలు తీసుకొని అతడికి దూరంగా ఉండటం మొదలు పెట్టింది. తాజాగా కనకపురకు చెందిన మరో వ్యక్తితో పరారైనట్లుగా వారు తమ ఫిర్యాదుల్లో పోలీసులకు తెలిపారు. తమకు న్యాయం చేయాలన్న ఇద్దరు భర్తల వైనం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News