మనోడి హార్ట్ వెరీ వీక్ గురూ !

మగవాడి గుండె జాలి గుండె బేల గుండె మాత్రమే కాదు, బలహీనమైన గుండె కూడా. జాలి గుండె బేల గుండె గురించి సినీ కవులు సాహిత్య కారులు ఎన్నో కవితలు గేయాలు రాశారు.;

Update: 2026-01-31 03:00 GMT

మగవాడి గుండె జాలి గుండె బేల గుండె మాత్రమే కాదు, బలహీనమైన గుండె కూడా. జాలి గుండె బేల గుండె గురించి సినీ కవులు సాహిత్య కారులు ఎన్నో కవితలు గేయాలు రాశారు. కానీ బలహీనమైన గుండె గురించి మాత్రం చెప్పాల్సింది వైద్యులే. అయితే అదే నిజమని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. ఆడవారితో పోలిస్తే మగవారి గుండె వెరీ వీక్ అని తేల్చేశారు. అందుకే తొందరగా మగవారికే గుండె పోటు వస్తుందని వారు అంటున్నారు.

అధ్యయనంలో తేలింది :

అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వ విద్యాలయ వైద్య కళాశాల ఇటీవల జరిగిపిన ఒక సుదీర్ఘమైన అధ్యయనంలో ఈ విషయం చాలా విపులంగా వెల్లడి అయింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుని పోయే ప్రమాదం ఆడవారితో పోలిస్తే మగవారిలో అధికమని స్పష్టం చేసింది. ఈ మూసుకుని పోయే ముప్పు ఆడవారిలో కంటే మగవారిలో వారి జీవిత కాలంలో ఏడేళ్ళ ముందే మొదలవుతుందని కూడా పేర్కొంది. ఈ లింగపరమైన తేడా అయితే ముప్పయ్యేళ్ళ వయసు నుంచే ప్రారంభం అవుతుందని చెబుతోంది.

జీవన శైలి మాత్రమే కాదు :

మగవారిలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి కారణం జీవన శైలి ఒక్కటే కారణం కాదని ఈ అధ్యయనం అంటోంది. సాధారణంగా ధూమపానం, మద్యపానం, అధిక రక్త పోటు, సుగర్ వంటి వాటి కారణంగా గుండె జబ్బులు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే వీటితో పాటుగా ఇతరత్రా కారణాలు కూడా ఇపుడిపుడే గుర్తిస్తున్నారు. ఇక ఈ చెడు అలవాట్లు జీవన శైలి ఆధునిక కాలంలో మహిళలు కూడా అలవరచుకుంటున్నారు అయినా మగవారికే అధిక ముప్పు ఎందువల్ల అన్నదే ఈ అధ్యయనంలో పరిశీలన చేశారు.

జీవ సంబంధమైనవి :

మగవారు మహిళలు ప్రస్తుతం దాదాపుగా ఒక రకమైన జీవన విధానంలో ఉన్నా కూడా ఇవన్నీ బాహాటపరమైన కారణాలుగా ఉన్నాయి. అయితే పురుషులు మహిళల గురించి లోతుగా పరిశీలన జరిపినపుడు జీవ సంబంధమైన తేడాల వల్ల కూడా మగవారికి ఎక్కువగా గుండే జబ్బులు వస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ అధ్యయనం ఏకంగా నలభై ఏళ్ళ పాటు అంటే 1980 నుంచి 2020 దాకా సాగింది. అదే సమయంలో అయిదు వేల మంది దాకా మహిళకు పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలలో అనేక విషయాలు వెల్లడి అయ్యాయి.

ఆ విషయంలో ఒక్కటే :

గుండె జబ్బులలో ఎక్కువగా ఇబ్బంది పడేది మగవారు అయితే పక్షవాతం విషయంలో మాత్రం మహిళలు పురుషులు సమానంగా ముప్పుని ఎదుర్కొంటున్నారు అని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయన సారాంశం ఏమిటి అంటే ముప్పై ఏళ్ళు దాటిన ప్రతీ పురుషుడూ తప్పనిసరిగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని అదే వారిని ప్రాణాపాయం నుంచి రక్షిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Tags:    

Similar News