వందేళ్ళ జీవితానికి చక్కటి ఆరోగ్య సూత్రాలు!
ఒకప్పుడు ప్రజల జీవనశైలి ఏ విధంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒళ్ళువంచి పని చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వయంగా పండించుకొని మరీ తినేవారు.;
ఒకప్పుడు ప్రజల జీవనశైలి ఏ విధంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒళ్ళువంచి పని చేయడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వయంగా పండించుకొని మరీ తినేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పెరుగుతున్న టెక్నాలజీ పరంగా ఈ మధ్యకాలంలో అన్ని యంత్రాలపైనే ఆధారపడ్డారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో పని చేసేవారు చాలా తక్కువే అని చెప్పాలి.. ఏ చిన్న పని చేయాలి అన్నా సరే యంత్రాలపైన ఆధారపడుతున్నారు. అటు ఆహారం విషయంలో కూడా మందులతో పండించిన ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
దీనికి తోడు అధిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడంతో మరెన్నో కారణాలవల్ల గుండెపోటు, మధుమేహం తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టూ ముడుతున్నాయి. అలా వందేళ్లు జీవించాల్సిన వ్యక్తులు 50 ఏళ్లు కూడా ఆరోగ్యంగా జీవించలేకపోతూ ఉండడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. నిజానికి ఒకప్పుడు మన ఇండియాలోనే వందేళ్లకు పైగా జీవించిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం సగటు వ్యక్తి జీవితకాలం 50 కూడా ఉండడం లేదు అనేది వాస్తవం.
అయితే ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ వందేళ్ల జీవితం పొందాలి అంటే కచ్చితంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెబుతున్నారు జపాన్ ప్రజలు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవిస్తున్న వారు ఎక్కడ ఉన్నారని ఆరా తీయగా.. జపాన్లోని ఒకినావా ప్రదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇటలీలోని సార్డీనియా, గ్రీస్ లోని ఇకారియా, కోస్తారికాలోని నికోయా ప్రాంతాలు ఉన్నాయి.. వీటన్నింటినీ కూడా బ్లూ జోన్స్ గా పిలుస్తున్నారు. అంటే దీర్ఘకాలిక జబ్బులు ఏమీ లేకుండా వందేళ్లపాటు జీవిస్తున్న వారు ఉండే ప్రాంతాలని బ్లూ జోన్స్ అని పిలుస్తారు.
ఇక్కడ ఉండేవారి దృష్టి ఆరోగ్యంపై కాకుండా జీవన నాణ్యత పై ఉంటుంది. వీరెవరు కూడా క్యాలరీలు లెక్కించుకొని తినరు. పదేపదే ఆహారపు అలవాట్లు, పద్ధతులను కూడా మార్చుకోరు. ఈరోజు ఏం తిందాం అని ఆలోచించకుండా ఆయా సమయాలలో స్థానికంగా దొరికే పదార్థాలను తీసుకుంటూ కడుపు నిండేలోపు తిండి ఆపేస్తారు. నూరేళ్లపాటు జీవించడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జీవనశైలిపై దృష్టి పెడతారు. కాబట్టి ఈ ఆరోగ్యం వారి సొంతం అయ్యింది పని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఆహారంపై దృష్టి పెట్టకుండా జీవన శైలిపై దృష్టి పెడితే ఇది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.