స్కూలు పిల్లల లంచ్ బాక్స్ లో ఏమిటీ దారుణం... వైరల్ వీడియో!

అవును... తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో స్కూలు పిల్లల లంచ్ బాక్సులో... ఇనిస్టంట్ నూడుల్స్ వంటి వంటకాలతో పాటు బంగాళాదుంప చిప్స్, చీజ్ బాల్స్ వంటి ప్యాక్ చేసిన స్నాక్స్‌ ను కలిగి ఉన్నారు.;

Update: 2026-01-27 12:16 GMT

ఇటీవల కాలంలో పిల్లల్లో ఫిట్ నెస్ పోవడానికి, మానసిక ఎదుగుదలలో పెను మార్పులు సంభవించడానికి, వయసు పెరిగే కొద్దీ వారి శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడానికి, చిన్న వయసులోనే బీపీ – షుగర్ వంటి వ్యాదుల బారిన పడటానికి, ఊబకాయానికి గురవ్వడానికి.. శారీరక శ్రమ లేకపోవడం ఎంత కారణమో.. అంతకంటే ఎక్కువగా ఆహారపు అలవాట్లు అంతకంటే ఎక్కువ కారణం అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో స్కూలు పిల్లల లంచ్ బాక్సులో... ఇనిస్టంట్ నూడుల్స్ వంటి వంటకాలతో పాటు బంగాళాదుంప చిప్స్, చీజ్ బాల్స్ వంటి ప్యాక్ చేసిన స్నాక్స్‌ ను కలిగి ఉన్నారు. వారిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే బ్రెడ్ - ఆమ్లెట్‌, రోటీ - సబ్జీని కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ తరహా ఆహారాన్ని లంచ్ బాక్స్ లో పెట్టిపంపడం వెనుక పిల్లల ఒత్తిడా, తల్లితండ్రుల సమయాభావమా అనే చర్చ మొదలైంది!

సాధారణంగా... ఇనిస్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫ్లేవర్డ్ బ్రెడ్లు, రెడీ-టు-ఈట్ ఫుడ్స్ వంటి వాటిని పిల్లలు విస్తృతంగా ఇష్టపడతారనే అనుకోవచ్చు. పైగా.. ఉదయం పూట బాక్స్ లు సిద్ధం చేయడానికి ఇది త్వరిత పరిష్కారం కూడా కావొచ్చు.. అందుకే చాలా లంచ్‌ బాక్స్‌ లలో ఇవి శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటుంటాయని చెబుతారు. ఇలాంటి ఆహారం పిల్లల సరదా కోసమో, ఆనందం కోసమో అప్పుడప్పుడూ పెట్టొచ్చు కానీ.. డైలీ ఈ తరహా ఆహారం మంచిది కాదని అంటున్నారు!

జంక్ ఫుడ్ పై క్రమం తప్పకుండా ఆధారపడటం పిల్లల ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని.. ఇనిస్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లో సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయని.. ఇదే సమయంలో.. ఫైబర్, ప్రోటీన్, అవసరమైన సూక్ష్మపోషకాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ అసమతుల్యత తరచుగా ఆకలి, సరిపడా ఎనర్జీ లేకపోవడంతో పాటు పేలవమైన ఏకాగ్రతకు దోహదం చేస్తుందని చెబుతున్నారు.

వీటి స్థానంలో కాస్త పక్కాగా ప్లాన్ చేసుకుని... చూడటానికి పిల్లలు ఇష్టపడే ఫుడ్ లుక్ లోనే ఉంటూ, మరింత కలర్ ఫుల్ గా ఉండే ఆహార పదార్థాలను ప్లాన్ చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా... వెజిటబుల్ పరాఠాలు, పనీర్ లేదా వెజ్ రోల్స్, చనా చాట్, చట్నీతో ఇండ్లీ లేదా ఉతప్పం, ఉడికించిన గుడ్లు లేదా ఆంలెట్, ఫ్రూట్ చాట్ వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు చాలా ముఖ్యమని అంటున్నారు!



Tags:    

Similar News