బంగారం ధర ... బీకేర్ ఫుల్
చూస్తుండగానే పది గ్రాముల బంగారం రూ.లక్షను దాటేసి.. అలవోకగా లక్షన్నర రూపాయిలకు చేరుకోవటం.. రెండు లక్షల లక్ష్యాన్ని అందుకుంటుందన్నట్లుగా దూసుకెళున్న పరిస్థితి;
బంగారం ధర కొండెక్కిన సంగతి తెలిసిందే. చూస్తుండగానే పది గ్రాముల బంగారం రూ.లక్షను దాటేసి.. అలవోకగా లక్షన్నర రూపాయిలకు చేరుకోవటం.. రెండు లక్షల లక్ష్యాన్ని అందుకుంటుందన్నట్లుగా దూసుకెళున్న పరిస్థితి. అనూహ్యంగా శుక్రవారం ఒక్క రోజులోనే గరిష్ఠంగా రూ.9వేల కంటే ఎక్కువగా తగ్గిన పరిస్థితి. ఇలాంటి వేళలోనూ బంగారం ధర భారీగా ఉన్నట్లే చెప్పాలి. పెరిగిన ధరలతో కొత్త ముప్పు ఎదురైనట్లుగా చెప్పాలి.
ప్రతిమహిళ ధరించే బంగారు తాళి ధరలు ఇప్పుడు భారీగా పెరిగినట్లే. ఒకప్పుడు మెడలో ఉంటే తాళి రూ.2-3 లక్షల మధ్య ఉంటే.. పెరిగిన ధరలతో వాటి విలువ భారీగా పెరిగింది. దీంతో ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్ ఎక్కువైంది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల ఛైన్ స్నాచింగ్ ఉదంతాలు నమోదయ్యాయి. తాజాగా కర్నూలులో ఇలాంటి క్రైం సీన్ చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఆలూరులో పట్టణంలోని ఎల్లార్తి రోడ్డుకు సమీపంలో రామప్ప, సరోజమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఇంటికి కారులో వచ్చారు. ఇంట్లో పెద్దాయన ఉన్నారా? అని సరోజమ్మను అడగటం.. లేరని ఆమె చెప్పటంతో.. ఫోన్ నెంబరు ఇవ్వాలని కోరారు. సరే.. ఇంటి పెద్దాయన ఫోన్ నెంబరు అడుగుతున్నారు కదా? అని నోట్ చేసుకొమ్మని చెప్పగా.. పెన్ను.. పేపర్ ఉంటే ఇవ్వాలని అడిగాడు ఆ గుర్తు తెలియని వ్యక్తి.. దీంతో వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళుతున్న ఆమె మెడలోని బంగారు తాళిని లాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో వెళ్లిపోయాడు. ఆమె లబోదిబోమంటూ బయటకు వచ్చేసరికి కారు వెళ్లిపోయింది. దీంతో.. ఆమె కన్నీరు మున్నీరు అయ్యే పరిస్జితి.
సరోజమ్మకు ఎదురైన పరిస్థితే.. అందరికి ఎదురవుతుందని చెప్పట్లేదు కానీ.. ఆ తరహా ఉదంతాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం మర్చిపోకూడదు. భారీగా పెరిగిన బంగారు ధరల వేళ.. బయటకు వెళ్లే వేళలో బంగారం బదులు ఇమిటేషన్ బంగారు నగల్ని ధరించటం మంచిది. లేదంటే.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో.. బీకేర్ ఫుల్.