తిరుపతి లడ్డూ...బడ్జెట్ సెషన్ కి జగన్ వస్తున్నారా ?

తిరుపతి లడ్డూ చుట్టూ గత కొన్ని రోజుల రాజకీయ వివాదం రాజుకుంది. సోషల్ మీడియా అయితే దీని మీద హోరెత్తిపోతోంది.;

Update: 2026-01-31 02:45 GMT

తిరుపతి లడ్డూ చుట్టూ గత కొన్ని రోజుల రాజకీయ వివాదం రాజుకుంది. సోషల్ మీడియా అయితే దీని మీద హోరెత్తిపోతోంది. తాము ఏ తప్పూ చేయలేదని వైసీపీ అంటోంది. కొవ్వు జంతువుల నూనె కలిసిందని కూటమి ప్రభుత్వ పెద్దలు గతంలో ప్రచారం చేశారని వారు క్షమపణలు చెప్పాలని వైసీపీ నేతలు అంటూంటున్నారు. దానికి ప్రతిగా కూటమి ప్రభుత్వం నుంచి మంత్రులు కీలక నేతలు వైసీపీ మీద ఎటాక్ చేస్తున్నారు. దాదాపుగా 68 లక్షల కేజీల కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారని వందల కోట్లు దీని వెనక చేతులు మారాయని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడిన నెయ్యితో లడ్డూలను తయారు చేశారు అని నిందిస్తున్నారు. దీనికి వైసీపీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కూటమి గట్టిగా డిమాండ్ చేస్తోంది.

భారీ కుట్రతో :

వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ దాఖలు చేసిన ఫైనల్ చార్జ్‌షీట్‌తో ఈ బండారం బట్టబయలైందని ఆయన అన్నారు. ఒక విధంగా చూస్తే ఇది స్లో పాయిజన్ ఇచ్చి హిందువులను హతమార్చే అతి పెద్ద కుట్రగా ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ వైసీపీ నేతలు హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో చర్చకు సవాల్ :

ఇదిలా ఉంటే ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాల ద్వారా సాగుతున్న లడ్డూ వివాదం అసెంబ్లీలో కూడా చర్చగా రానుందని అంటున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీద చర్చకు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రావాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు అక్కడే తాము స్పష్టంగా చెబుతామని వారు అంటున్నారు. జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఈ సవాల్ ని స్వీకరించి రావాలని కోరుతున్నారు.

అది జరిగే పనేనా :

అసెంబ్లీకి వైసీపీ రావడం లేదు, ఇది జరిగి ఇరవై నెలలు దాదాపుగా అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం పెద్దలు మాత్రం అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు. ఇపుడు చూస్తే శ్రీవారి లడ్డూ ఇష్యూ హాట్ హాట్ గా ఉంది. దీని మీద పూర్తి సమాచారంతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ నేతలు అక్కడ మాట్లాడేందుకు సిద్ధం కావాలని కూటమి నేతలు కోరుతున్నారు. మరి జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ఇష్యూని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టి అసలు జరిగిన వాస్తవాలు దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలు అన్నీ జనాలకు అత్యున్నత చట్ట సభ వేదికగా తెలియచేస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News