శ్రీ పరాభవలో ఎన్నో శుభ ముహూర్తాలు !
మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం అయినా శుభాలను మోసుకొస్తుందా అన్నది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది మంచి ముహూర్తాలు శుభ ఘడియాలు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు.;
తెలుగు వారికి కొత్త సంవత్సరం వచ్చేసింది. . దాని పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. మరి చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ పన్నెండు తెలుగు నెలలు ఉండే ఈ ఏడాదిలో ఎన్ని శుభ ముహూర్తాలు ఉన్నాయన్నది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. గత ఏడాది అయితే శుభ ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. పైగా మూఢాలతో పుణ్య కాలాలు వెళ్ళిపోయాయి. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం అయినా శుభాలను మోసుకొస్తుందా అన్నది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది మంచి ముహూర్తాలు శుభ ఘడియాలు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఉగాది అంటే ఏంటి :
యుగానికి ఆరంభం అన్నది ఉగాదిగా చెబుతారు. ఇక్కడ ఏడాదికి తొలి రోజు అని అర్థం గా చూడాలి. తెలుగు సంవత్సరాది విశిష్టత ఏంటి అంటే ప్రకృతిని దృష్టిలో ఉంచుకుని సాగుతుంది. ఉగాది చైత్రంలో వస్తుంది అంటే ప్రకృతి పూస్తుంది. చిగురులు పెడుతుంది. అంతా వికసిస్తుంది. ఇక ఆ తరువాత వర్షాకాలం వస్తుంది. దాంతో శ్రావణ భాద్రపదాలు వర్షాలకు సూచికంగా చెబుతారు. ఇక శీతాకాలానికి సంకేతంగా తీసుకుంటే కార్తీకం మార్గశిరం పుష్య మాసాలను చెబుతారు. అలా కాలలకు తగినట్లుగా పండుగలు కూడా ఉంటాయి. అందుకే తెలుగు సంవత్సరాదినే ప్రకృతికి ప్రతిబింబంగా చూస్తారు.
శుభాలకు కూడా కేంద్రంగా :
మొత్తం పన్నెండు మాసాలు ఉంటే అందులో అన్ని మాసాలూ శుభాలకు ప్రమాణంగా తీసుకోరు ఇందులో ఆషాడం, భాద్రపదం, పుష్యం మాసాలను శూన్య మాసాలుగా చెబుతారు. ఈ మాసాలలో ఎటువంటి శుభ కార్యాలు చేసుకోరు. ఎక్కువగా శుభాలు జరిగేవి చెప్పాలంటే చైత్ర వైశాఖాలు, అలాగే శ్రావణ మాసం, కార్తీకం, మాఘ మాసాలను పేర్కొంటారు. అంతే కాదు ఉత్తరాయనంలో చేసే శుభాలు ఉంటాయి. దక్షిణాయనంలో చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఉత్తరాయనంలో ఉపనయనాలు గృహ ప్రవేశాలు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మకర సంక్రాంతి తరువాత సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. దానిని బట్టి ఉత్తరాయనంలోకి సూర్యుడు ప్రవేశించాడు అని చెబుతారు అలా ఆరు నెలల పాటు అంటే జూన్ దాకా ఉత్తరాయనం కొనసాగుతుంది.
వివాహాది శుభాలకు :
ఇక శ్రీ పరాభవ నామ సంవస్తరంలో చైత్రమాసంలో కొత్త వ్యాపారాలకు మార్చి 27, ఉపనయనాలు వ్యాపారాలు, శంకుస్థాపనలకు మార్చి 28వ తేదీ దివ్యంగా ఉంటుంది అని చెబుతున్నారు. వివాహాలకు మార్చి 29 ఎంతో అనుకూలమైనదిగా పేర్కొంటున్నారు. అదే విధంగా మే నెలలో 1, 3, 6, 7,8, 9, 10, 11లలో వివాహాలకు వ్యాపారాలలకు గృహ ప్రవేశాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే జూన్ నెలలో 17 నుంచి జూలై 9 వరకూ చూస్తే అన్నీ మంచి రోజులే ఉన్నాయి. ఈ సమయంలో వివాహాలు చేసుకోవచ్చు, గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు.
అనుకూలించే తేదీలు :
ఇక శ్రావణ మాసంలో చూస్తే ఆగస్టు 15, 16, 20, 22 తేదీలలో పెళ్ళిళ్ళకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. కార్తీక మాసంలో చూస్తే నవంబర్ 12 నుంచి 22 వరకూ పెళ్ళిళ్ళ సీజన్ గా చెప్పాలి. మంచి ముహూర్తాలు ఈ నెలలో ఇవే అని అంటున్నారు. ఇక్కడ నుంచి చూస్తే 2027 ఫిబ్రవరి లోనే అంటే మాఘమాసంలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 7 నుంచి 29 వరకు వరసగా మంచి రోజులు అన్నీ వివాహాది శుభ కార్యాలకు అనుకూలించేవి అని అంటున్నారు. ఇక 2027 లో ఫాల్గుణ మాసంలో అంటే మార్చి 10 నుంచి ఏప్రిల్ 2 వరకూ శుభ ముహూర్తాలు అనేకం ఉన్నాయి. ఈ సమయంలో వివాహాలు గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎంతో మేలు అని పండితులు చెబుతున్నారు.