హోలాష్టక్...అశుభాలు ఎన్ని రోజులు ?
శుభ కార్యాలు చేసుకోవడానికి శుక్ర మూఢమి వదిలిందని అంతా సంతోషిస్తున్నారు. అయితే హోలాష్టక్ పేరుతో మళ్ళీ మంచి రోజులు లేవని అంటున్నారు.;
శుభ కార్యాలు చేసుకోవడానికి శుక్ర మూఢమి వదిలిందని అంతా సంతోషిస్తున్నారు. అయితే హోలాష్టక్ పేరుతో మళ్ళీ మంచి రోజులు లేవని అంటున్నారు. హోళీ పండుగకు ముందు వచ్చే ఒక ఎనిమిది రోజులను అశుభాలుగా భావిస్తారుట. ఇది హిందూమతంలో ఒక సంప్రదాయంగా ఉంది అని అంటున్నారు. ఈసారి హోళీ పండుగ మార్చి 4వ తేదీన పడింది. దాంతో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3వ తేదీ వరకూ ఉన్న ఎనిమిది రోజుల సమయాన్ని హోలాష్టక్ అని చెబుతున్నారు. ఇంతకీ హోలాష్టక్ లో ఏమి చేయకూడదు అన్నది అయితే పండితులు వివరిస్తున్నారు.
వాటి ప్రకారం చూస్తే :
మన హిందూ సంప్రదాయం అంతా జ్యోతీష్యం మీద వేదాంత శాస్త్రం మీద ఆధారపడి సాగుతునిద్. ఆ విధంగా చూస్తే హోలాష్టక్ గా చెబుతున్న ఎనిమిది రోజులలో గ్రహాలు చాలా హింసాత్మకంగా ఉంటాయని చెబుతున్నారు. అంతే కాదు నెగిటివ్ ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అందువల్ల వాటి ప్రభావం మానవ జీవితం మీద పడుతుందని గుర్తు చేస్తున్నారు. దాంతో వివాహ ముహూర్తాలు ఈ సమయంలో పెట్టుకోవద్దు అని చెబుతున్నారు. అంతే కాదు పెళ్ళి నిశ్చితార్ధాలు కూడా పెట్టుకోవద్దు అని అంటారు. ఎందుకంటే జీవితంలో విభేదాలు వస్తాయని అంటున్నారు.
వీటికీ నిషిద్ధమే :
ఇక కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేయాలనుకునే వారు కూడా ఈ హోలాస్టక్ కాలంలో గృహ ప్రవేశం చేయకూడదు అని అంటున్నారు. అలాగే కొత్తగా ఆస్తులను కొనుగోలు చేయరాదని చెబుతున్నారు. దీని వల్ల ఆ కొత్త ఇంట్లో కూడా అది తీవ్రమైన నెగిటివ్ ప్రభావానికి దారి తీస్తుంది అని అంటున్నారు. ఇక అశాంతి గా ఉంటుందని ఆనందం అన్నది కూడా కనిపించదని అంటున్నారు.
గ్రహాలు శుభ ప్రదంగా :
ఈ హోలాష్టక్ కాలంలో గ్రహాలుఇ శుభ ప్రదంగా ఉండవని చెబుతున్నారు. అందువల్ల ఈ ఎనిమిది రోజులలో పిల్లలకు పేర్లు పెట్టడం కానీ అలాగే ఉపనయనాలు చేయడం కానీ చేయకూడదని చెబుతున్నారు. అదే విధంగా బిడ్డల తొలితలనీలాలు ఇవ్వడం వంటివి చేయరాదని అంటున్నారు.
వీటికి దూరంగా :
ఇక ఈ ఎనిమిది రోజులలో కొత్తాగ వ్యాపారాలు చేయడం వంటివి కూడదని అంటున్నారు. అలాగే ఇతరులతో కలసి వ్యాపార వర్తక వ్యవహారాలలో కూడా పాల్గొనవద్దు అని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల వ్యాపారాలలో నష్టం వస్తుందని అంటున్నారు. అంతే కాదు ఆర్ధికంగా ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. మరి హోలాష్టక్ విషయంలో పెద్దగా శుభ కార్యక్రమాలు పెట్టుకోకుండా దూరంగా ఉండడమే మేలు అని చెబుతున్నారు.