• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Astrology >  ప్రపంచ అంతానికి ఆరంభం...

ప్రపంచ అంతానికి ఆరంభం వచ్చే ఏడాదేనా?

| గతంలో ఆమె చెప్పిన అంచనాలు ఎన్నో నిజమైన వేళ.. వచ్చే ఏడాది (2025)లో ప్రపంచ అంతానికి సంబంధించి ఒక ఘటన చోటు చేసుకుంటుందని చెప్పారు.

By - Tupaki Desk
Update: 2024-11-04 04:44 GMT

ప్రపంచం అంతం కానుందన్న అంచనాలు కొత్తేం కాదు. ఇదిగో ఏదో అవుతుంది? అదిగో మరేదో జరగనుందన్న వాదనలు.. అంచనాలు అప్పుడప్పడు వినిపిస్తూ ఉంటాయి. అయితే.. గడిచిన కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే మాత్రం సమ్ థింగ్ రాంగ్ అన్న భావన కలుగక మానదు. ఏవైపు చూసినా ఏదో ఒక అనిశ్చితి.. అశాంతి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళలో పాత విషయాలే కొత్తగా తెర మీదకు వస్తున్నాయి. బల్గేరియన్ కాలజ్ఞానిగా బాబా వంగా చెప్పిన అంచనాలు ఇప్పుడు మరోసారి ప్రస్తావిస్తున్నారు.

గతంలో ఆమె చెప్పిన అంచనాలు ఎన్నో నిజమైన వేళ.. వచ్చే ఏడాది (2025)లో ప్రపంచ అంతానికి సంబంధించి ఒక ఘటన చోటు చేసుకుంటుందని చెప్పారు. 2025లో భారీ యుద్ధం ఒకటి జరగనుందని ఆమె హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు చేస్తుందని.. 5079 నాటికి మానవ జాతి పూర్తిగా నాశనమవుతుందన్నది ఆమె అంచనా. ఇప్పటివరకు నిజమైన బాబా వంగా అంచనాల్ని చూస్తే.. రెండో ప్రపంచ యుద్ధంతో భారీ విధ్వంసం.. ఎక్కువ మరణాలు.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం.. చెర్నోబిల్ విపత్తు.. స్టాలిన్ మరణం.. కుర్క్స్ జలాంతర్గామి విపత్తు.. అమెరికాపై సెప్టెంబరు 11న జరిగే దాడిని ఉక్కు పక్షుల దాడిగా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆమె అంచనాలు 85 శాతం నిజమయ్యాయి. 1911 అక్టోబరు 3న జన్మించిన బాబా వంగా తన 84వ ఏటన 1996 ఆగస్టు11న కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో 2025లో ఆమె చెప్పిన అంచనా విషయానికి వస్తే.. ‘‘2025 నాటికి భూమిపై గ్రహాంతర జీవులు కనిపిస్తాయి. ఈ జీవులు భూమిపై తమ ఉనికిని చాటుకుంటాయి’’ అని పేర్కొన్నారు. 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ కూడా ఇలాంటి అంచనాల్నే అందించారు. 2025లో జరిగే యూరోపియన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఆమె చెప్పిన ఇతర అంచనాల్ని చూస్తే.. వాతావరణ మార్పులతో ఏర్పడే కరువు.. అడవుల్లో కార్చిచ్చు లాంటి విపత్తులతో పాటు.. 2043 నాటికి యూరోప్ ముస్లిం పాలనలోకి వస్తుందని.. 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచ వ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని అంచనా వేశారు. వీటన్నింటికి ముందు మరో రెండు నెలల తర్వాత మొదలయ్యే 2025లో జరిగే దానిపైనే అందరి చూపు ఉందని చెప్పాలి.

Tags:    
  • Babavanga 
  • Babavangaprediction 
  • Worldcollapse 
  • Worldwar 
  • Unitedstates 
  • People 

Similar News

శ్రీ పరాభవలో ఎన్నో శుభ ముహూర్తాలు !

2026-03-19 13:45 GMT

ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలంటే ?

2026-03-15 15:30 GMT

హోలాష్టక్...అశుభాలు ఎన్ని రోజులు ?

2026-02-23 22:30 GMT

ఇక అన్నీ మంచి శకునములే !

2026-01-31 13:30 GMT

2026 గురించి షాకింగ్ గా నోస్ట్రడమస్ అంచనాలు!

2025-12-26 19:30 GMT

2026లో అరుదైన ఖగోళ విశేషం: 13 నెలలు.. అధిక జ్యేష్ఠ మాసం!

2025-11-28 20:30 GMT

'ఏలియన్స్ వస్తున్నారు'.. 2026కి బాబా వంగా చెప్పిన అంచనాలివే!

2025-11-26 11:05 GMT

పవన్ నోట మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మాట

2025-11-11 13:49 GMT

నవరాత్రుల్లో అదృష్టం దక్కే రాశులు : శుభయోగాలతో సంపన్నులవ్వబోయేవారు ఎవరు?

2025-09-22 06:46 GMT

చంద్రగ్రహణం: ఆ రాశుల వారంతా ఆర్నెల్లు అదరగొడతారట

2025-09-07 05:23 GMT

వైరల్ ఆడియో : వేణు స్వామి అపాయింట్మెంట్ రూ.10 వేలు!

2024-08-13 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS