• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Astrology >  వైరల్ ఆడియో : వేణు స్వామి...

వైరల్ ఆడియో : వేణు స్వామి అపాయింట్మెంట్ రూ.10 వేలు!

| ఈ క్రమంలోనే ఒక వ్యక్తి వేణు స్వామి అపాయింట్మెంట్ కోసం ఆయన ఆఫీస్‌కు కాల్ చేసి ఆడుకున్న ఆడియో ఒకటి లీక్ అయింది.

By - Tupaki Desk
Update: 2024-08-13 08:30 GMT

తెలుగులో ప్రముఖ జ్యోతిష్యులు ఎందరో ఉన్నారు కానీ.. వాళ్లందరినీ మించిన పాపులారిటీ వేణు స్వామిది. సోషల్ మీడియాలో ఆయన చాలా పాపులర్. సెలబ్రెటీల వ్యక్తిగత, వృత్తిగత జీవితాల ఎవ్వరూ అడక్కపోయినా జ్యోతిష్యం చెప్పేస్తూ మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారాయన.

ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మూడేళ్లలోనే విడిపోతారంటూ ఆయన ఏవేవో లెక్కలేసి భవిష్యత్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడే నిశ్చితార్థం చేసుకున్న జంట గురించి ఇలా జోస్యం చెప్పేసరికి జనాలకు మండిపోయింది. ఆయన మీద సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి వేణు స్వామి అపాయింట్మెంట్ కోసం ఆయన ఆఫీస్‌కు కాల్ చేసి ఆడుకున్న ఆడియో ఒకటి లీక్ అయింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వుతుంది . ఆ వ్యక్తి రిసెప్షన్‌కు ఫోన్ చేసి వేణు స్వామి అపాయింట్మ్ంట్ గురించి వాకబు చేయగా.. అవతలి నుంచి ఒక మహిళ మాట్లాడింది. రేపు వేణు స్వామి అపాయింట్మెంట్ కావాలని అడిగితే.. ఓకే అని చెప్పి అపాయింట్మెంట్‌కు రూ.10 వేలు అవుతుందని చెప్పింది. ఎంత సెలబ్రెటీ జ్యోతిష్యుడైనప్పటికీ అపాయింట్మెంట్ 10 వేలా అని ఇప్పుడు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కాల్ చేసిన వ్యక్తి తన సంభాషణను కొనసాగిస్తూ వేణు స్వామిని బూతులు తిట్టాడు.

అంతే కాక నేను వేణు స్వామికి జ్యోతిష్యం చెబుతా.. నాకెంత ఇస్తారు అని అడిగాడు. దీంతో అవతలి వ్యక్తికి మండిపోయి గొడవకు దిగింది. త్వరలో మీ ఉద్యోగం కూడా ఊడిపోతుందని కాల్ చేసిన వ్యక్తి అన్నాడు. అంతే కాక ఏపీలో జగన్ గెలుస్తాడని చెప్పారు మరి ఏమైంది అని అడిగితే.. ఫెయిలైందే చెబుతున్నారు, ఎన్నో సక్సెస్ అయ్యాయి కదా అంటూ ఆమె దబాయించింది. ఏపీలో జగనే కాదు.. తెలంగాణలో కేసీఆర్ కూడా మళ్లీ గెలుస్తారని వేణు స్వామి చెప్పారు. అంతే కాక ప్రభాస్ కెరీర్లో ఉచ్ఛస్థితి ఎప్పుడో అయిపోయిందని.. ఇక ఆయనకు మళ్లీ సక్సెస్ రాదని కూడా గతంలో వ్యాఖ్యానించారు వేణుస్వామి. కట్ చేస్తే సలార్, కల్కి లాంటి మెగా హిట్లు అందుకున్నాడు ప్రభాస్.

Tags:    
  • VenuSwamy 
  • Appoinment 
  • Famousastrologer 
  • Socialmedia 
  • Nagachaitanya 
  • Sobhita 
  • Engagement 
  • Jagan 
  • Ap 
  • Kcr 

Similar News

శ్రీ పరాభవలో ఎన్నో శుభ ముహూర్తాలు !

2026-03-19 13:45 GMT

ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలంటే ?

2026-03-15 15:30 GMT

హోలాష్టక్...అశుభాలు ఎన్ని రోజులు ?

2026-02-23 22:30 GMT

ఇక అన్నీ మంచి శకునములే !

2026-01-31 13:30 GMT

2026 గురించి షాకింగ్ గా నోస్ట్రడమస్ అంచనాలు!

2025-12-26 19:30 GMT

2026లో అరుదైన ఖగోళ విశేషం: 13 నెలలు.. అధిక జ్యేష్ఠ మాసం!

2025-11-28 20:30 GMT

'ఏలియన్స్ వస్తున్నారు'.. 2026కి బాబా వంగా చెప్పిన అంచనాలివే!

2025-11-26 11:05 GMT

పవన్ నోట మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మాట

2025-11-11 13:49 GMT

నవరాత్రుల్లో అదృష్టం దక్కే రాశులు : శుభయోగాలతో సంపన్నులవ్వబోయేవారు ఎవరు?

2025-09-22 06:46 GMT

చంద్రగ్రహణం: ఆ రాశుల వారంతా ఆర్నెల్లు అదరగొడతారట

2025-09-07 05:23 GMT

ప్రపంచ అంతానికి ఆరంభం వచ్చే ఏడాదేనా?

2024-11-04 04:44 GMT

Copyright @2026

Powered by Blink CMS