దుష్టుల నుంచి దూరం...బాబు ఉగాది సందేశం
ఇక బాబు స్పీచ్ లో తల్లీ చెల్లీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్ధంతో తల్లికి చెల్లెలికి ఆస్తులు ఇవ్వని కొందరు వ్యక్తులు కూడా ఉంటారని ఇండైరెక్ట్ గా బాబు పేల్చిన సెటైర్లు వైసీపీ అధినాయకత్వం మీదే అని అంటున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త తెలుగు సంవత్సరాది వేళ ఆధ్యాత్మికతతో కూడిన ప్రసంగం చేస్తూనే ప్రజలకు అందులో సందేశం కూడా ఇచ్చారు. ఏపీలో గడచిన కాలంలొ ఆభివృద్ధిని ఆయన తెలియచేస్తూ అయిదేళ్ల వైసీపీ హయాంలో ఏ విధంగా విద్వంశం రాష్ట్రానికి జరిగింది అన్నది తెలియజేసే ప్రయత్నం చేశారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కొనసాగనివ్వాలని బాబు కీలక సూచన చేయడం విశేషం. మధ్యలో దుష్టులు చేసే ప్రయత్నాలను గమనించాలని ఏమరుపాటుతో వ్యవహరించకూడదని హెచ్చరించడం విశేషం.
అప్రమత్తంగా ఉండాలి :
రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి పాలన సజావుగా సాగుతోందని అభివృద్ధి అన్ని వైపుల నుంచి కనిపిస్తోంది అని చంద్రబాబు చెప్పారు. అయితే వీటి నుంచి దుష్టులు ఏమారుస్తారని, అలాంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాను అని బాబు చెప్పడం గమనార్హం. మరి దుష్టులు ఎవరు అన్నది ఆయన వివరించకపోయినా రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి కచ్చితంగా అర్ధం అవుతుంది అని భావించాలి. రాజకీయ ప్రత్యర్ధులను దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ విధంగా పరోక్ష విమర్శలు చేశారు.
పండుగలు అంటే భయం :
ఇక బాబు తన ప్రసంగంలో మరో మాట కూడా అన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో పండుగలు చేసుకునేందుకే జనాలు భయపడ్డారు అని ఆయన విమర్శించారు. 2024కు ముందు ఐదేళ్లు ఎవరూ సంతోషంగా పండుగలు కూడా జరుపుకునే పరిస్థితి లేదని ఆయన గుర్తు చేశారు. కేవలం ఒకే ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసం, దారుణాలు ఆనాడు ఏపీలో జరిగాయని పరోక్షంగా వైసీపీ మీద విమర్శలు చేశారు. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడిందని, ఏపీలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని బాబు చెప్పారు.
తల్లీ చెల్లీ అంటూ :
ఇక బాబు స్పీచ్ లో తల్లీ చెల్లీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్ధంతో తల్లికి చెల్లెలికి ఆస్తులు ఇవ్వని కొందరు వ్యక్తులు కూడా ఉంటారని ఇండైరెక్ట్ గా బాబు పేల్చిన సెటైర్లు వైసీపీ అధినాయకత్వం మీదే అని అంటున్నారు. ఈ తీరుగా సమాజంలో కొందరు ఉండబట్టే మళ్లీ ఉమ్మడి కుటుంబాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నామని బాబు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆర్దిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఆయన వెల్లడించారు. భారతదేశం అంటే ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండే సంప్రదాయం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకునే విధానం మనదని బాబు అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీతో మళ్లీ జనాభాను పెంచేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అందరివాడుగా ఉండాలనే :
తాను పనిచేసేది అయిదు కోట్ల మంది తెలుగు ప్రజల కోసమని, అందరి జీవన ప్రమాణాలు మెరుగు పర్చటం కోసమని బాబు చెప్పారు. అందరి కోసం అందరివాడు గా పనిచేస్తున్నాను అని బాబు స్పష్టం చేశారు. తానుఅందరి వాడిగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతే కాదు సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అందుకోసమే పేదల జీవన ప్రమాణాలు కూడా పెంచేలా పీ4 కార్యక్రమాన్ని తీసుకువచ్చామని ఆయన తెలిపారు సమాజంలో సంపన్నులైన 10 శాతం మంది ఉన్నారని అదే సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది ఉన్నారని, ధనవంతులు పేదలను ఆదుకునేలా పీ4 పేరుతో కార్యక్రమం చేపట్టామని బాబు చెప్పారు. ఈ విధంగా సమాజంలో అట్టడుగున ఉండిపోయిన పేదలకు చేయూతను ఇచ్చి పైకి తీసుకువచ్చేలా కార్యాచరణ చేపట్టామని ఆయన తెలిపారు.
మూడు పుష్కరాలు ఎంతో గౌరవం :
ఇక ముఖ్యమంత్రిగా తాను ఉన్న సమయంలోనే వరసగా మూడు గోదావరి పుష్కరాలను చేపట్టడం ఎంతో పుణ్యమని బాబు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తున్నాయని అలా మూడో సారి ఈ పుష్కరాలను నిర్వహించే గౌరవం తనకు దక్కిందని బాబు చెప్పుకొచారు. అలాగే ఆ తరువాత 2028లో కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని వాటిని కూడా తాను రెండు సార్లు సీఎం గా ఉండగా నిర్వహించడం అదృష్టం అన్నారు.