శశిథరూర్ బావమరిదికి సైన్యంలో టాప్ పోస్ట్

కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు అయిన శశిధరూర్ కి స్వయాన బావమరిది అయిన రాజేష్ పుష్కర్ భారత సైన్యంలో కీలక పదవిలో నియమితులయ్యారు.

Update: 2026-06-27 03:56 GMT

కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు అయిన శశిధరూర్ కి స్వయాన బావమరిది అయిన రాజేష్ పుష్కర్ భారత సైన్యంలో కీలక పదవిలో నియమితులయ్యారు. ఆయన పుణే కేంద్రంగా ఉన్న సదరన్ కమాండ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ గా జూలై 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు భారతీయ ఆర్మీ ఆయనను ఈ పదవిలో నియామకం చేసింది. ప్రస్తుతం రాజేష్ పుష్కర్ ఖార్గా కార్ప్స్ కమాండర్‌గా ఉన్నారు. ఆయనకు మూడున్నర దశాబ్దాలకు పైగ సైనిక అనుభవం ఉంది.

ఆయన ప్రత్యేకతలు :

ఇక భారత ఆర్మీ కొత్త రూపుని సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. అత్యాధునిక ఆయుధ సంపత్తిని సాంకేతిక సహకారంతో కలిపి తన పాటవాన్ని పెంచుకుంటోంది. ఈ నేపధ్యంలో కొత్త బాధ్యతలు అందుకుంటున్న రాజేష్ పుష్కర్ కి ఆధునిక యుద్ధ సాంకేతికతలో విశేష అనుభవం ఉంది. అంతే కాదు డ్రోన్లు సైనిక దౌత్యం అలాగే స్ట్రైక్ ఆపరేషన్లలో గణనీయమైన అనుభవం ఉందని చెబుతున్నారు. తన అనుభవంతో ఆయన నాయకత్వంలో సదరన్ కమాండ్ మరింత ఆధునికీకరణ దిశగా ముందుకు సాగనుందని భారత రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.

అత్యంత పురాతనమైనది :

ఇదిలా ఉంటే పుణే ప్రధాన కేంద్రంగా పనిచేసే సదరన్ కమాండ్ మొత్తం భారత సైన్యంలోనే అత్యంత పురాతనమైన అతి పెద్ద కమాండ్‌లలో ఒకటిగా చెబుతారు. ఈ సదరన్ కమాండ్ పరిధిలోకి జోధ్‌పూర్‌లోని కోణార్క్ కార్ప్స్‌ అలాగే సుదర్శన్ చక్ర కార్ప్స్ వివిధ రకాలైన ట్రైనింగ్ సెంటర్లు లాజిస్టిక్స్ యూనిట్లు పరిపాలనా విభాగాలు కూడా ఉన్నాయి. సాధారణ సైనిక భద్రతతో పాటు తీర ప్రాంత రక్షణ ఒక సవాల్ గా ఉంటుంది. దాంతో ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కీలక బాధ్యతలను కూడా ఈ సదరన్ కమాండ్ నిర్వహిస్తూ ఉంటుంది.

శశిధరూర్ రియాక్షన్ :

తన సొంత బావమరిదికి ఇంతటి కీలక పదవి రావడంపైన శశిథరూర్ స్పందించారు. రాజేష్ పుష్కర్ కి తగిన అవకాశంగా ఆయన పేర్కొన్నారు. ఆయన సైన్యంలో చూపిన ప్రతిభకు అలాగే క్రమశిక్షణకు దేశం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావానికి ఈ పదవి ఒక గౌరవం అని అన్నారు. ఇక భారత్ సైన్యం మొత్తంలో ఆరు ఆపరేషన్ కమాండులు ఉంటే అందులో సదరన్ కమాండ్ అత్యంత పెద్దది. అలాంటి కమాండ్ కి చీఫ్ గా రాజేష్ పుష్కర్ రావడం పట్ల కేంద్ర మాజీ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ పదవిని స్వీకరిస్తున్న శుభ సందర్భంలో ఆయనకు బావగా కేంద్ర మాజీ మంత్రిగా కూడా శశిధరూర్ తన ఆశీస్సులు గ్రీటింగ్స్ అందచేయడం విశేషం. మొత్తానికి చూస్తే బావ రాజకీయాల్లో ఉంటూ ప్రజా సేవ చేస్తూంటే బావమరిది దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి పనిచేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇలా ఉన్నత స్థానాలకు ఎదగడం అంట్రే గ్రేట్ అనే అంతా అంటున్నారు.

Tags:    

Similar News