జగన్ రిస్క్...కేటీఆర్ కి కిక్కు !

జగన్ కేటీఆర్ ల మధ్యన ఉన్నది సోదర బంధం. ఇద్దరూ ఆప్యాయంగా అలా సంభోదించుకుంటారు.

Update: 2026-06-27 03:56 GMT

జగన్ కేటీఆర్ ల మధ్యన ఉన్నది సోదర బంధం. ఇద్దరూ ఆప్యాయంగా అలా సంభోదించుకుంటారు. జగన్ కి చాలా తక్కువ మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటారు. అందులో కేసీఆర్ ఫ్యామిలీ ఒకటి. అఫ్ కోర్స్ ఈ మధ్యనే తమిళనాడు సీఎం విజయ్ కూడా జగన్ క్లోజ్ రిలేషన్ లిస్ట్ లో చేరారు. ఆ సంగతి పక్కన పెడితే జగన్ కేటీఆర్ కనిపిస్తే సందడి చేస్తారు. హుషారుగా మాట్లాడుకుంటారు. ఇక కేటీఆర్ తరచూ మీడియా ఇంటర్వ్యూలకు వెళ్తూంటారు. ఆయన జగన్ గురించి పాజిటివ్ గానే ఎపుడూ మాట్లాడుతూంటారు. తాజాగా ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ జగన్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అసలు జగన్ ఆ రిస్క్ ఎలా చేశారో అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. ఇంతకీ ఏమిటా రిస్క్ అంటే జగన్ చేసిన బంగీ జంప్ అన్న మాట.

జగన్ బంగీ జంప్‌పై కామెంట్స్ :

జగన్ అప్పట్లో అంటే విపక్ష నేతగా ఉన్నపుడు విదేశీ పర్యటనలో భాగంగా బంగీ జంప్ చేశారు. అది ఆనాడు వైరల్ కూడా అయింది. అయితే ఆ బంగీ జంప్ గురించి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. జగన్ ఎలా చేశారో అని కూడా అన్నారు. ఈసారి కలసినపుడు జగన్ ని బంగీ జంప్ గురించి అడుగుతాను అని కూడా కేటీఆర్ చెప్పారు. తనకు అయితే బంగీ జంప్ అంటే ఎంతో భయమని కేటీఆర్ చెప్పరు. కేవలం ఒక తాడు మీదనే ఆధారపడి కిందకు దూకడం అంటే ఎంతో భయంగా అనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. అది జగన్ కి ఎలా సాధ్యమైంది అన్నది తనకు అర్ధం కావడం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన్ని లసి ఈ డౌట్ అయితే తీర్చుకుంటాను అని నవ్వుతూ కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి.

కేసీఆర్ అంటే అదన్నమాట :

గోడ మీద వేలాడుతున్న తుపాకీ కదా అని లైట్ తీసుకుంటే ఎంత ప్రమాదమో అన్నది తెలిసిందే. కేసీఆర్ కూడా గోడ మీద అమర్చిన తుపాకీ లాంటి వారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒక విధంగా రాజకీయ ప్రత్యర్ధులకు కేసీఆర్ అంటే ఏమిటో అలా విడమరచి చెప్పనవసరం లేకుండా సింపుల్ గా చెప్పారు అనుకోవాలి. కేసీఆర్ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయవద్దు అని ఇండైరెక్ట్ గానే కేటీఆర్ స్పష్టం చేశారు.

గర్జించే సింహం :

కేసీఆర్ గర్జించే సింహమని కూడా కేటీఆర్ చెప్పారు. అయితే దానికి సరైన సమయం వస్తుందని అపుడు కచ్చితంగా ఆయన గర్జించి తీరుతారు అని కూడా అన్నారు. తామంతా కేసీఆర్ బాటలోనే సాగుతామని కేటీఆర్ చెప్పారు. నాయకుడు అన్ని సార్లూ ముందుండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ నేత కేసీఆర్ వెనక నుంచి తమను నడిపిస్తారు అని కేటీఆర్ చెప్పారు. మొత్తానికి ఈ ఇటర్వ్యూ ద్వారా కేటీఆర్ ఇద్దరు మాజీ సీఎంలను తలచుకున్నారు. అందులో జగన్ సాహసాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే కేసీఆర్ గర్జన ఎలా ఉంటుందో చూస్తారని ప్రత్యర్ధులకు హెచ్చరించారు. కేటీఆర్ ఈ కామెంట్స్ అయితే వైరల్ గా మారాయిపుడు.

Tags:    

Similar News