భారంగా కరోనా ఖననం..సిమెట్రీల్లో స్థలం కొరత!

Update: 2020-08-15 00:30 GMT
కరోనా వైరస్ .. రోజురోజుకి దేశంలో నమోదు అయ్యే కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగానే పెరుగుతున్నాయి. కరోనా వస్తే ఇప్పుడు హాస్పిటల్ లో చేరడం అంటే అమెరికా వెళ్లినంత కష్టం పడాల్సి వస్తుంది. అడ్మిషన్‌ కావాలంటే సిఫార్సు.. సరిగ్గా చూడాలని డాక్టర్లకు రికమండేషన్‌. బెడ్‌ కావాలనీ, ఆక్సిజన్‌ పెట్టాలనీ.. ఇలా అడుగడుగునా డబ్బులు, పలుకుబడి ఉంటేనే కరోనా రోగికి చికిత్స జరిగేది. ఇవన్నీ రోగిని బతికించడం కోసం జరిగేవి. అయితే , వీటన్నింటినీ మించిన పలుకుబడి ప్రదర్శించాల్సిన మరో సందర్భం వచ్చింది.
 
 అదే.. రోగి మరణించిన తర్వాత అవసరం పడేది. శ్మశానంలో స్థలం. ఆ స్థలం కోసం.. వ్యాధి పీడితుడి బంధువులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలకు  శ్మశానాల్లో  స్థలం కొరత మరింత ఆవేదనకు గురిచేస్తుంది. కరోనా కాలంలో ఈ  అవస్థలు ఎక్కువయ్యాయి. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఎవరైనా మరణిస్తే ఖననం చేస్తారు. ప్రస్తుతం  సిమెట్రీలన్నీ సమాధులతో నిండిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని  మెట్టుగూడ సిమెట్రీలో స్థలం లేదు. బోయిగూడ, తిరుమలగిరిలలో స్థలం ఉన్నప్పటికీ స్థానికులు అక్కడ ఖననం చేయటానికి ఇష్టపడటం లేదు.

జంటనగరాల్లో 15 లక్షల మంది క్రైస్తవ జనాభా ఉంది. 70 సిమెట్రీలు ఉన్నాయి. అందులో 13 సిమెట్రీలు మాత్రమే అధికారంగా ఉన్నాయి. మిగతా 57 క్రైస్తవులు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. కరోనా  మృతదేహాలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు వెచ్చించి సొంత ఖర్చులతో నగరం బయట ఉన్న సిమె ట్రీలలో ఖననం చేస్తున్నారు. సిమెట్రీల సమస్య పరిష్కారం విషయమై బిషప్‌ తుమ్మబాల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నూతన సిమెట్రీల నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు.. ఈ సమస్య ఇప్పటిది కాదు , ఎప్పటినుండో ఉన్నది కాబట్టి దీనిపై ప్రభుత్వం సత్వరమే ఓ నిర్ణయం తీసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
Tags:    

Similar News