మోడీకి ఇంటి పోరు మొద‌ల‌యిందా ?

Update: 2017-09-02 11:25 GMT
అమిత్ షా - మోడీల ద్వ‌యం చూస్తే పార్టీ మీద వారికి గ‌ట్టి ప‌ట్టు ఉన్న‌ట్లు అనిపించినా అదంతా పైపై మెరుగే అని .. ఎక్క‌డ తేడా వ‌చ్చినా పార్టీలోని ఎంపీలు, నేత‌లు బీజేపీ అధిష్టానం మీద విరుచుకుప‌డ‌తార‌ని అనిపిస్తోంది. తొలిసారి బీజేపీ పూర్తిస్థాయి బ‌లంతో అధికారంలో ఉన్నందున అది క‌నిపించ‌డం లేద‌ని, మోడీ - అమిత్ షాలు ఎక్క‌డ త‌ప్ప‌ట‌డుగు వేసినా పార్టీలో అసంతృప్తి గ‌ళాలు అన్నీ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అనిపిస్తోంది.

మ‌హారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ తాజాగా మోడీకి వ్య‌తిరేక గ‌ళం విప్పాడు. ఆయ‌న‌దే మొద‌టి స్వ‌రం కావ‌డం విశేషం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేక గళం బీజేపీలో తొలిసారి బయటపడింది.  ప్రభుత్వ ప్రణాళికల గురించి సొంత పార్టీ సహచరులు ప్రశ్నించినా మోదీ ఇష్టపడరని, పార్లమెంటేరియన్ల సదస్సులో తాను రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నించినపుడు తనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వ‌చ్చిన ప‌టోలే ఎన్‌ సీపీ నేత ప్రఫుల్ పటేల్‌ ను గోండియా - భండారా లోక్‌ సభ నియోజకవర్గంలో ఓడించారు.  ఆయ‌న ఓడించిన ప‌టేల్ తో బీజేపీ అధిష్టానం స‌న్నిహితంగా ఉండ‌డాన్ని ప‌టోలే త‌ప్పుప‌డుతున్నాడు. పార్టీ త‌న‌ను ప్ర‌శ్నించినందుకు హిట్ లిస్ట్ లో పెడుతుంద‌ని తెలుస‌ని, నాకు మంత్రి ప‌ద‌వి మీద ఆశ‌లేదు. నేను ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు. కేంద్ర మంత్రులుగా ఉన్నవారే భ‌యంభ‌యంగా బ‌తుకుతున్నార‌ని ప‌టోలే బీజేపీలో ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.
Tags:    

Similar News