ఏపీకి కేసీఆర్ సర్ ప్రైజ్ ఇస్తారా?
కేసీఆర్ తనకు నచ్చిందే చేస్తారు. కానీ ధారాళంగా చేస్తారు. ఏదైనా అంతే. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న కేసీఆర్ ఇప్పటికే జగన్ తో మంచి సంబంధాలు నెరపుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతతో ముందుకుపోతున్నారు. ఏకంగా అన్ని రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టే నీటి పంపకాల విషయంలోనూ ఇద్దరు ఏకతాటిపైకి రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ముందు కూడా ఇలా సఖ్యంగా ముందుకెళ్లి ప్రజల మనసు దోచుకుంటే... ప్రజలు - మనం ఇద్దరం బాగుంటామన్న కోణంలో జగన్ తో కేసీఆర్ ముచ్చటించారట.
అయితే, ఎపుడు ఏం చేయాలో బాగా తెలిసిన కేసీఆర్ ఇటీవల జగన్ అన్నీ కేసీఆర్ కు ఇచ్చేస్తున్నాడన్న ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టి - భ్రమలు తొలగించడానికి ఏపీకి ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అమరావతి శంకుస్థాపన సమయంలో ఇవ్వాలనుకుని మోడీని తక్కువ చేయడం ఇష్టం లేక విరమించుకున్న ఆర్థిక సాయాన్ని కేసీఆర్ ఆంధ్రాకు ప్రకటించాలని అనుకుంటున్నట్టు సమాచారం. సెప్టెంబరులో మరోసారు ఇద్దరు ముఖ్యమంత్రులు కలవనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం తనను టెన్షన్ పెట్టిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికే దానిని ఆయనకు అందజేశారు. ఇపుడు తాజాగా ఏపీ ప్రజలకు బహుమానం ఇస్తున్నారన్నమాట. ఏదేమైనా ఇరు రాష్ట్రాల సఖ్యత ప్రజలకు కూడా ఉపయోగకరమే. యథారాజా తథా ప్రజ అన్నట్టే ... ప్రజల్లో కూడా ఇరు రాష్ట్రాల సంబంధాలు పాజిటివ్ వైబ్స్ ని పంపిస్తాయి. ఉపాధి, మానవ సంబంధాలను ఇవి పెంపొందిస్తాయి. ఉద్యమం ద్వారా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఎక్కడైనా మనసుల్లో కొన్ని విభేదాలున్నా అవి సమసిపోయేలా చేస్తాయి. అందుకే గతం మరచి భవిష్యత్తును నిర్మించుకునే క్రమంలో కేసీఆర్ - జగన్ ల మధ్య సంబంధాలను ఈ నిర్ణయం మరో దశకు తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.