జగన్ సాహసం.. పేదలకు 30లక్షల ఇళ్ల స్థలాలు

Update: 2020-08-09 05:09 GMT
కరోనా కల్లోలం వేళ కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదు. అంతకుమించి అన్నట్టుగా ప్రజలకు పథకాలు అందజేస్తోంది. లోటు బడ్జెట్ లోనూ పేదల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ముందుకెళుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటవుతున్న వైఎస్ ఆర్ - జగనన్న కాలనీల్లో పేదల కోసం ప్రభుత్వం 15 లక్షల ఇళ్లను నిర్మించనుంది. రాష్ట్రంలో అర్హులైన 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుండడంతో వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే 26వేల ఎకరాలకు పైగా భూముల్లో లేఔట్లు వేసి పట్టాలు పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది.

రాష్ట్రంలో మొత్తం కుటుంబాల్లో దాదాపు 20శాతం పేదలకు ఏడాదిలోనే ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. మొదటి విడతలో 15లక్షల ఇళ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రణాళికలు నిర్వహించారు.

లబ్ధిదారులపై ప్రీకాస్ట్ ఆసీసీ శ్లాబ్ తో ఇళ్లు నిర్మించేందుకు డిజైన్ తయారు చేశారు. టెండర్లను గృహ నిర్మాణ శాఖ టెండర్లు పిలిచింది.

Tags:    

Similar News